అంజలికి చెన్నై కోర్టు వార్నింగ్, రాకపోతే అరెస్టే?
తమిళ దర్శకుడు కళంజియం అంజలిపై పరువు నష్టం దావా వేసిన కేసుతో పాటు, అంజలి కనిపించడం లేదని, ఆమెను రప్పించాలని పిన్ని భారతీదేవి దాఖలు చేసిన పిటీషన్లు కోర్టు విచారిస్తోంది. ఇప్పటికే పలు దఫాలు కోర్టుకు గైర్హాజరైన అంజలి ఈ సారి కూడా మరోసారి డుమ్మాకొట్టింది.
జూన్ 5న కోర్టు ఆదేశాల మేరకు హాజరు కాక పోతే...ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కళంజియం తరుపు న్యాయవాది అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి. కనీసం ఎందుకు రాలేక పోయాననే వివరణ కూడా అంజలి ఇవ్వక పోవడం గమనార్హం.
పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి హాజరు కావడం లేదని, ఆమె మూలంగా తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. ప్రస్తుతం కోర్టుకెక్కిన అంజలి-కళంజియం వ్యవహారానికి తెరపడేదెప్పుడో?


Click it and Unblock the Notifications












