twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: రాజకీయ పార్టీ నుంచి కొత్త తలనొప్పి.. కోర్టు వరకు లాగుతం అంటూ రాజమౌళికి హెచ్చరిక

    |

    తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR మార్చి 25వ తేదీన విడుదల కానుంది. డివివి. దానయ్య నిర్మాతగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు.. కేవలం నిజమైన పాత్రలతోనే ఒక ఫిక్షన్ కథలు రూపొందించినట్లు దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను మొదలుపెట్టే ముందే క్లారిటీ ఇచ్చాడు అయితే ఈ సినిమాపై మొదటి సారి ఒక రాజకీయ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది చరిత్రను వక్రీకరించిన విధంగా సినిమాను రూపొందించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఈ సినిమాలో వెంటనే మార్పులు చేయకపోతే కోర్టుకు వెళతామని రాజమౌళికి హెచ్చరిక చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

     సినీ లోకమంతా..

    సినీ లోకమంతా..

    దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని అనిపిస్తోంది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటించిన సినిమా కావడంతో కేవలం మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా సినీ లోకమంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది.

     ప్రమోషన్స్ కోసమే..

    ప్రమోషన్స్ కోసమే..

    ఈ సినిమా కోసం నిర్మాత డివివి దానయ్య దాదాపు 450 కోట్ల వరకు భారీ బడ్జెట్తో నిర్మించిన జరిగింది. అంతేకాకుండా ప్రమోషన్స్ కోసమే మరొక 30 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక విప్లవ పోరాట యోధుల క్యారెక్టర్ లను తీసుకుని వాటిని అద్భుతమైన కథలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రెజెంట్ చేయబోతున్నారు. సినిమా ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చాలా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది.

     సిపిఐ నేత ఆరోపణలు

    సిపిఐ నేత ఆరోపణలు

    అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై పలువురు ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని అల్లూరి సీతారామరాజు అలాగే కొమురంభీం పాత్రలను ఉపయోగించుకొని వారి పోరాట పటిమను కూడా కించపరిచే లాగా చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయడం మాత్రం సరైంది కాదు అని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణలు వ్యక్తం చేశారు.

    డబ్బు కోసమే..

    డబ్బు కోసమే..

    రామకృష్ణ మాట్లాడుతూ.. గిరిజనుల కోసం అలాగే దేశం కోసం ఎంతో నిస్వార్థంగా పోరాడిన కొమరంభీం అల్లూరి సీతారామరాజు పాత్రలను దర్శకుడు రాజమౌళి డబ్బు కోసం RRR సినిమాను తెరకెక్కించినట్లుగా ఉంది.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీసాఫీసర్ గా పనిచేసినట్లు చూపిస్తున్నారు అది ఎంతమాత్రం నిజం కాదు అని.. ఆరోపించారు

    అమ్మాయిలతో డ్యాన్స్..

    అమ్మాయిలతో డ్యాన్స్..

    అలాగే కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు వంటి పాత్రలతో బ్రిటిష్ అమ్మాయిలతో డాన్స్ చేయించినట్లు గా సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు చూపిస్తున్నారు. ఇది చరిత్రలో యువతను పక్కదారి పట్టించే విధంగా ఉంది. సినిమాలు రిలీజ్ చేసే ముందు కొమరం భీమ్ అల్లూరి కుటుంబ సభ్యులకు అలాగే చరిత్రకారులకు కూడా సినిమాను తప్పకుండా చూపించాలి అని అన్నారు.

    కోర్టు వరకు వెళదాం..

    కోర్టు వరకు వెళదాం..

    రాజమౌళి చాలా మంచి దర్శకుడు ఆ విషయంలో మేము ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు తప్పు పట్టడం లేదు. సినిమాను సినిమాగానే చూడాలి అని చెబుతున్నారు. అలాంటప్పుడు డబ్బుల కోసం అలాంటి ప్రాణాలు అర్పించిన వీరుల పేర్లు ఎందుకు వాడుకోవాలి. ఒక విధంగా యువతను ఈ సినిమాతో తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే సన్నివేశాలను మార్చకపోతే కోర్టు వరకు కూడా వెళ్లడానికి వెనుకడుగు వేయమని, సెన్సార్ బోర్డు ముందు ధర్నా చేస్తామని కూడా రామకృష్ణ వివరణ ఇచ్చారు. మరి సిపిఐ నాయకులు చేసిన వ్యాఖ్యలపై రాజమౌళి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

    English summary
    CPI leader Ramakrishna shocking comments on RRR movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X