మెగాస్టార్ పై అనుచిత వ్యాఖ్యలు.. తప్పుతెలుసుకుని క్షమాపణలు చెప్పిన నారాయణ!

మెగాస్టార్ చిరంజీవిపై సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిల్లర బేరగాడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపద్యంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆయనకు గడ్డి పెట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నారాయణ వెనక్కి తగ్గుతూ క్షమాపణలు చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే

కృష్ణ వచ్చి ఉంటే

కృష్ణ వచ్చి ఉంటే

మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ ఆహ్వానం మేరకు భీమవరం వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి ఘనమైన స్వాగతం లభించింది, అయితే ఈ విషయం మీద తాజాగా సిపిఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ఈ వేడుకకు పిలవాల్సింది కాదంటూ పేర్కొన్న ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర చేసి దాని ద్వారా తెలుగు ప్రజలందరికీ దగ్గరైన కృష్ణ ఆ ఫంక్షన్ కి వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.

ప్రకటన చేయడంతో

ప్రకటన చేయడంతో

ఆయనను పిలిచి ఉంటే బాగుండేది కానీ ఈ చిల్లర బేరగాడు, ఈ బ్రోకర్ చిరంజీవిని పిలిచారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆటం బాంబు లాంటివాడని ఎప్పుడు పేలతాడో ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడో ఎవరికీ తెలియదు అంటూ ఆయన కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో పూర్తిస్థాయిలో ఆయనను ఒక రేంజ్ లో ఆడుకోవడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టుగానే నాగబాబు కూడా దానికి సంబంధించిన ఒక ప్రకటన చేయడంతో ఈ విషయం మరింత ముదిరింది.

మరిచిపోండి

మరిచిపోండి

తాజాగా ఈ నేపథ్యంలో తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ నారాయణ వివరణ ఇచ్చుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా, భాషా దోషంగా భావించాలి, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోండి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని

ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని

తప్పు ఎవరు చేసినా సరే.. ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించండి మన మెగా జనసైనికుల ధర్మం. కాబట్టి సీపీఐ నారాయణ పెద్ద వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జనసైనికులందరినీ కోరుతున్నానని నాగబాబు అన్నారు. నిన్నఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నాగబాబు పేర్కొన్నారు.

అన్నం పెట్టండి

అన్నం పెట్టండి

కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడని, కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ...! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X