షాకిచ్చిన 'శ్రీరామ రాజ్యం' ప్రీమియర్ షో టిక్కెట్
నందమూరి బాలకృష్ణకు యుఎస్ లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉందని మరోసారి రుజువైంది.తాజాగా ఆయన చిత్రం శ్రీరామరాజ్యం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ 2,500 డాలర్స్ కు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది.కొల్లా అశోక్ బాబు అనే అభిమాని ఆ టిక్కెట్ ని పొంది తన అభిమానాన్ని చాటుకున్నారు.ఇక చిత్రం నవంబర్ 17న విడుదల అవుతుండగా ఈ ప్రీమియర్ షో మాత్రం నవంబర్ 16 న జరుగుతుంది.ఈ విషయాన్ని బ్లూ స్కై సినిమా వారు ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియచేసారు.సింహా తర్వాత పుంజుకున్న బాలకృష్ణ ఈ చిత్రంతో మరోసారి ఘన విజయం సాధిస్తాడని అందరూ అంచనాలు వేస్తున్నారు.
బాలకృష్ణ శ్రీరాముడిగా,నయనతార సీతగా నటించిన చిత్రం 'శ్రీరామ రాజ్యం. బాపు దర్శకత్వంలో సాయి బాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 17న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''బాలకృష్ణకు పౌరాణిక పాత్రలంటే మహా ప్రీతి. తన తండ్రి ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని శ్రీరాముడి పాత్రను ఎంతో ఇష్టంతో పోషించారు. ఇటీవల విడుదల చేసిన స్టిల్స్‌లో శ్రీరాముడిగా బాలకృష్ణ ఆహార్యం అద్భుతంగా ఉందని మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోంది.రేపు సినిమాకి కూడా అదే విధంగా మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది.నేటి తరం,రేపటి తరం, ఆ తర్వాతి తరం వారు రామాయణాన్ని గుర్తుంచుకోవాలనే ఆకాంక్షతో ఈ చిత్రాన్ని బాపు అత్యంత సుందరంగా తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.ఇప్ప టికే పాటలు ప్రజాదరణ పొందాయి అన్నారు.


Click it and Unblock the Notifications











