క్రేజీ న్యూస్: శంకర్, మెగాస్టార్ కాంబినేషన్‌లో మూవీ.. కొరటాల, త్రివిక్రమ్ పరిస్థితి ఏమిటో!

భారీ బడ్జెట్ చిత్రాలకు, అత్యంత సాంకేతిక విలువలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు శంకర్. తాజాగా 2.0 చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించి హాలీవుడ్ స్థాయి దర్శకుడు అనే పేరును సొంతం చేసుకొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్‌ రికార్డులకు చిరంజీవి మారుపేరు. ఇలా ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఎప్పటి నుంచి సినీ ప్రేక్షకులను వెంటాడుతున్నది. అయితే ఈ మెగా కాంబినేషన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదనేది సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే...

ఇండియన్ 2 ఆగిన తర్వాత

ఇండియన్ 2 ఆగిన తర్వాత

2.0 చిత్రం తర్వాత కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు శంకర్ ప్రయత్నించారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తీరా సెట్స్‌పైకి వెళ్లే సమయంలో ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోవడం తమిళ సినీరంగంలో చర్చనీయాంశమైంది.

 ఇండియన్ 2 కథనేనా? లేక..

ఇండియన్ 2 కథనేనా? లేక..

కమల్ హాసన్‌తో తెరకెక్కించే ఇండియన్ 2 సినిమా కథనే చిరంజీవితో సినిమాగా రూపొందిస్తున్నారనే ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇండియన్ 2 కాదని.. చిరంజీవి ఇమేజ్‌కు సరిపడే కథతో శంకర్ వస్తున్నారని ఇలా రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే అధికారికంగా వెల్లడి కాకపోవడంతో ఈ కాంబినేషన్‌పై మరిన్నీ రూమర్లు వచ్చే అవకాశం లేకపోలేదు.

అల్లు అరవింద్ నిర్మాతగా

అల్లు అరవింద్ నిర్మాతగా

ప్రస్తుతం శంకర్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌తో ప్రాజెక్టుకు సిద్ధమయ్యారట. మెగాస్టార్‌ అందుకు సిద్ధంగా ఉండటంతో వీరిద్దరి కలయికకు గ్రీన్ సిగ్నల్ పడింది. అయితే ఈ సినిమాక అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. శంకర్ తన కథను తెలుగులో చిరంజీవితో, తమిళంలో విజయ్ లేదా అజిత్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

 కొరటాల, త్రివిక్రమ్, శంకర్ సినిమాలతో

కొరటాల, త్రివిక్రమ్, శంకర్ సినిమాలతో

సైరా తర్వాత చిరంజీవి చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా అనౌన్స్ చేశారు. కొరటాల శివ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందనే వార్త వినిపించింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఈ అంశం అనేక చర్చలకు దారి తీస్తున్నది. కొరటాల శివకు ముందు శంకర్ సినిమా ఉంటుందా? లేక త్రివిక్రమ్ సినిమా తర్వాత శంకర్ సినిమా ఉంటుందా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X