బాలకృష్ణ సెంచరీ కొట్టడానికి ఓ క్రేజ్ ప్రొజెక్ట్ కోసం కుస్తీ...?
నటసింహ బాలకృష్ణ త్వరలో 100 చిత్రాలు పూర్తిచేసుకోనున్నాడు. ప్రస్తుతం బాపు దర్శకత్వంలో బాలకృష్ణ మైతలాజికల్ ఫిల్మిం శ్రీరామరాజ్యం, పరుచూరి ముళి దర్శకత్వంలో ఈ మద్యనే మొదలైన 'హర హర మహాదేవ' బాలయ్య నట జివీతంలో 96వ చిత్రం. ఇక పొతే బాలయ్య 100 వ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా రూపొందించటానికి ఆయన సన్నిహితులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సంకేతాలు అందుతున్నాయి. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. త్రిష ఇప్పటికే ఓ కథానాయికగా ఎంపికకాగా, కాజల్ మొదటి హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మూడో కథానాయికగా ప్రియమణి ఎంపికయ్యిందని సమాచారం.
ఈ చిత్రానికి చిన్నికృష్ణ తయారుచేసిన 'నందీశ్వరుడు' కధను ఎంపిక చేసుకునట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని బాలయ్యతో 'సమరసింహరెడ్డి' నిర్మించిన చెంగల వెంకట్రావ్ నిర్మించనున్నాడు. 'సింహ' సినిమాతో బాలయ్య లో కొత్త ఉత్సాహాన్ని నింపిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాద్యత స్వికరించనున్నాడని సమాచారం. నందీశ్వరుడు చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











