ముద్దులకే అంత దుమారం రేగింది... ఇక ఈ పాట చూడండి మరీ (వీడియో)

బేఫికర్ మూవీ యూనిట్ "ఖుల్ కే డుల్కే" అనే హాట్ సాంగ్ ని విడుదల చేసింది. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్య చోప్రా.. ఇప్పటిదాకా తీసింది మూడే మూడు సినిమాలు. 'రబ్ నే బనాదె జోడీ' వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా బేఫికర్. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయిన వెంట‌నే చాలా మంది పెద‌వి విరిచారు. ట్రైల‌ర్‌లో ఏం లేద‌ని తేల్చిప‌డేశారు. ట్రైలర్లో.. ముద్దులు.. ఇంటిమేట్ సీన్లు తప్ప..? రొమాన్స్ తప్ప ఫీల్ ఏదీ..? అసలు సినిమాలో ఏమైనా ఎమోషన్ ఉన్నట్లుందా..? అసలు ఆ వాణీ కపూర్ ఏంటి అలా తయారైంది..? అంటూ చాలా నెగెటివ్ కామెంట్లు పడ్డాయి 'బేఫికర్' ట్రైలర్ చూడగానే. కానీ డివైడ్ టాక్ తో మొదలైన సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సంపాదించినట్లుగా.. ఈ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. కేవలం 48 గంటల్లో కోటిన్నర మంది ఈ ట్రైలర్ వీక్షించడం విశేషం.

ఆ ట్రైలర్ మత్తునుంచి ఇంకా బయట పదక ముందే ఇప్పుడు 'ఖుల్ కే డుల్కే' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట మొత్తం పారిస్ వీధుల్లోనే తీయడం విశేషం. ఎప్పటి లాగానే రణవీర్ సింగ్.. వాణి కపూర్ లు ఇరగదీసేశారు. డ్యాన్సులతో.. ఆఖర్లో లిప్ లాక్ తో బాగా ఆకట్టుకున్నారు. కానీ పూర్తిగా పారిస్ లో.. ఆ నగర అందాల మధ్య.. అక్కడి భామలతో తీసిన ఈ పాటకు ఇండియన్ టచ్ ఇచ్చారు. పూర్తిగా పంజాబీ టైప్ భాంగ్రా డ్యాన్సులతో 'ఖుల్కే డుల్కే' పాట సాగుతుంది. మ్యూజిక్ విపరీతంగా ఆకట్టుకోవడం ఈ పాటకు ప్లస్ పాయింట్. ఇక విదేశీ భామలకు చిట్టి పొట్టి డ్రస్సులు వేసి.. దేశీ డ్యాన్సులు చేయిస్తుంటే.. విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న బేఫికర్ మూవీలో.. 23లిప్ లాక్ సీన్స్ ఉన్నా సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వివాదాస్పదమైనా కూడా సినిమా మాత్రం మంచి అంచనాలతోనే ఉంది.

ఈ చిత్రంలో దాదాపు 24 కిస్ సీన్లు ఉండగా ప్రతీ నెలా 9వ తారీఖున ఏదో ఒక కిస్సింగ్ పోస్టర్‌ని రిలీజ్ చేస్తూ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లని చూసి యూత్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారంటే ఆ కిస్ సీన్లు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక వెరైటీ ప్రమోషన్స్‌తో మూవీపై భారీ అంచనాలు పెంచుకునే విధంగా చిత్ర యూనిట్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనుండగా, తాజాగా చిత్రానికి సంబంధించి ఖుల్ కే డుల్కే అనే సాంగ్ ని విడుదల చేసింది. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X