నాగ్ సినిమాకు క్రేజీ టైటిల్.. అర్జున్‌రెడ్డిని ఫాలో అవుతున్న వర్మ
టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం శివ. అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచనల విజయం సాధించింది. అలాంటి చిత్రం రూపొందిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్, వర్మ కాంబినేషన్ రీ
Recommended Video

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం శివ. అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచనల విజయం సాధించింది. అలాంటి చిత్రం రూపొందిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్, వర్మ కాంబినేషన్ రీపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎలాంటి పేరు పెడుతారో అనే ఓ సందేహం ఫ్యాన్స్‌ను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన టైటిల్స్ వెలుగులోకి వచ్చాయి.

పరిశీలనలో విభిన్నమైన టైటిల్
వర్మ రూపొందించబోయే సినిమాలో నాగార్జున పోలీస్ అధికారిగా నటించనున్నాడనేది తాజా సమాచారం. పోలీస్ కథ అంటే అండర్ కరెంట్‌గా మాఫియా స్టోరి కంపల్సరీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లలో తుపాకులు, పిస్టల్స్‌తో అదరగొట్టేశాడు. ఈ సినిమా కథకు సరిపోయే విధంగా విభిన్నమై టైటిల్‌ను పరిశీలీస్తున్నట్టు తెలుస్తున్నది.

అర్జున్‌రెడ్డి మాదిరిగా
కథ డిమాండ్ మేరకు, నాగ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి గన్, సిస్టమ్ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారట. అయితే టైటిల్ తెలుగులో ఉంటుందా లేదా ఇంగ్లీష్‌లో ఉంటుందా అనే విషయంపై క్లారిటీ లేదు. అర్జున్‌రెడ్డి మాదిరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

కొత్త తరహాలో నాగ్
నవంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు నాగార్జున చేయని తరహాలో ఈ చిత్రం ఉంటుందని వర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.

నాగ్ సరసన మైరా సరీన్
క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందే ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా సరీన్ అనే కొత్త హీరోయిన్ నటించనున్నది. డిసెంబర్‌లో కొన్ని రోజులు షూటింగ్ చేస్తామని నాగార్జున వెల్లడించారు. అఖిల్ సినిమా హల్లో ప్రమోషన్ తర్వాత జనవరిలో పూర్తిస్థాయి షూటింగ్‌కు వెళ్తామని నాగ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











