ఫిల్మ్ ఫన్ : కామన్ సెన్స్ లేని క్రియేషన్

By Staff

K Raghavendra Rao
దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన ఆర్.కె.టెలీఫిలింస్ పతాకంపై సీరియల్స్ ఫ్రారంభించిన కొత్తల్లో ఓ తమాషా జరిగింది. అప్పుడు ఆయన క్రింద ఇప్పుడు బయిట డైరక్టర్స్ గా నిలదొక్కుకున్న వాళ్ళు అసెస్టెంట్స్ గా పనిచేసేవారు.వారంతా కలసి ఓ రోజు ఓ పేరు పొందిన సీరియల్ కోసం ఓ గొప్ప సీను క్రియేట్ చేసారు.అది తమ గురువుకి చెప్పకుండా దాచి...చివర్లో సరఫ్రైజ్ చేద్దామనుకున్నారు. ఇంతకీ ఆ సీను ప్రకారం హీరో కొద్దిరోజులుగా ఇంటికి దూరంగా ఉండి తిరిగి వస్తాడు.ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా పండుగ వాతావరణం.ఎటు చూసినా హంగామా.అప్పుడు అతను విషయమేమిటని అడిగితే మీ భార్య నెలతప్పింది అని పొరుగువాళ్ళు చెప్పి అతన్ని ఆనందపరుస్తారు.అతనూ ఆనందంతో భార్యని చేరి మురిసిపోతాడు.అలా ఫీల్ పండించే కార్యక్రమంలో ఉన్నారట.

ఈ సీను కోసం ఇంటి సెట్ ని అలంకరిస్తూండగా రాఘవేంద్రరావుగారు ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి వచ్చి అడిగారుట.అప్పుడు సీన్ మొత్తం చెప్పారట. విన్న వెంటనే ఆయన ఆ పనులన్నీ ఆపుచేయమన్నారట. ఇప్పుడు షాకవటం అందరి వంతయింది. అప్పుడాయన సాధారణంగా భార్య నెలతప్పితే మొదట భర్తకి చెప్పుకుంటుంది గాని ప్రక్కింటి వాళ్ళకి కాదు.కాబట్టి వాళ్ళకి ముందు తెల్సి యేర్పాట్లు చేయటం ఎప్పుడూ పండదు.అని విషయం విశదరీకరించారట. అదీ అనుభవం తెచ్చే కామన్ సెన్స్ గొప్పతనం. రాఘవేంద్రరావు గారుకి అది ఎక్కువ కాబట్టే నేటి తరం దర్శకులకు సైతం ఆయన పోటీ ఇవ్వగలుగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X