త్రివిక్రమ్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్: అది తనకు దెబ్బే అంటున్న ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. టబును కీలక పాత్ర కోసం తీసుకోన్నారని, ఈ విషయమై ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని టాక్.
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. త్వరలో షూటింగ్ మొదలు కాబోతోంది. త్రివిక్రమ్ సినిమాలు అంటనే ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. అందుకు తగిన విధంగానే ఆయన సినిమాలో నటులు, పాత్రలు ఉంటాయి. కేవలం హీరో మీదనే సినిమా నడవకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తారు త్రివిక్రమ్.

కీలకమైన పాత్రలో టబు?
ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం టబును తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు. దీనిపై ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు సమాచారం.

సీనియర్ హీరోయిన్లు ఉంటే ఎన్టీఆర్‌కు దెబ్బ
తన సినిమాలో సీనియర్ హీరోయిన్లు ఉంటే పెర్ఫార్మెన్స్ పరంగా తనకు ప్రాధాన్యత తగ్గుతుందని, అది సినిమా మీద దెబ్బ పడుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. గతంలో ఎన్టీఆర్ సినిమాల్లో రమ్యకృష్ణ, నగ్మ నటించారు. ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. అందుకే ఎన్టీఆర్ ఈ విషయంపై త్రివిక్రమ్‌తో వాదిస్తున్నాడట.

ఎన్టీఆర్ వాదనతో ఏకీభవించని త్రివిక్రమ్
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాదనతో దర్శకుడు త్రివిక్రమ్ ఏకీభవించడం లేదట. తన సినిమాలో అలా జరిగే అవకాశం లేదని, అలా జరుగనివ్వను, ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుంది, అందుకు తన గత సినిమాలే మంచి ఉదాహరణ అని హీరో ఎన్టీఆర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట త్రివిక్రమ్.

చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో
మరి టబు విషయంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎవరి వాదన నెగ్గుతుంది అనేది త్వరలో తేలనుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ఎన్టీఆర్ 28
ఎన్టీఆర్ కెరీర్లో 28వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ(చిన బాబు) నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి మూవీ. అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ వరుస సక్సెస్‌లతో మంచి జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











