క్రియేటివిటీ అంటే 'నైన్ టు ఫైవ్' జాబ్ కాదు!

ఇక ఇన్నాళ్ళూ ఇలా ఉత్సాహంగా బోర్ కొట్టకుండా ఎలా కొనసాగుతున్నారూ అంటే సమాధానంగా నేను ఏదొ ఒకటి కొత్తగా చేయటంలో ఆనందం అనుభవించటానికి అలవాటు పడ్డాను. అందులోనూ క్రియేటివిటీ అనేది నైన్ టు ఫైవ్ జాబ్ కాదు. అది ఏదో చేయాలన్న ఆసక్తిలోంచి పుడుతుంది. నా మటుకు నేను మెకానికల్ కావటానికి ఇష్టపడను,ప్రతీ క్షణం ఏదో ఒక కొత్త స్ట్రగుల్ ఫేస్ చేయటానికి ప్రిపేర్ అవుతాను. ప్రతీ రోజూ కొత్త ఎక్సపీరియన్సే నాకు. ఒక ఆర్టిస్టుగా నేను ఎప్పుడూ అలిసిపోనూ...సాటిస్ ఫై కాను..ఛాలెంజ్ ఉండాల్సిందే...మరి మీకు మిగిలిపోయిన కోరికలు,ఛాలెంజ్ లు ఏమన్నా ఉన్నాయా అంటే నాకు ఎప్పటినుంచో ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే కోరిక,అంతేగాక ఏదైనా ఓ మ్యూజికల్ ఇనిస్ట్రమెంట్ ని నేర్చుకోవాలనే ఆశ. ఏదోక రోజు గ్యారింటీగా ఆ కోరికలు తీర్చుకుంటా..అలాగే ఆయన కోరికలు తీరాలని మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.
అమితాబ్ బచ్చన్ పేరు చెబితేనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు పులకించిపోతారు. బిగ్ 'బి' గా బాలీవుడ్ బాద్షాగా చిరపరిచితమైన అమితాబ్ నేడు 66 వ ఏట అడుగు పెట్టారు. ఆరడుగుల అందగాడిగా హిందీ చిత్ర రంగంలో ప్రవేశించిన అమితాబ్ 1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో జన్మించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న అమితాబ్ మహత్తరమైన ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. జంజీర్","దీవార్","షోలే","కాలాపత్తర్","నమక్‌హలాల్","త్రిశూల్" వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.


Click it and Unblock the Notifications











