»   » చారిటీ మ్యాచ్‌లో అదరగొట్టిన టాలీవుడ్ టీం (ఫోటో ఫీచర్)

చారిటీ మ్యాచ్‌లో అదరగొట్టిన టాలీవుడ్ టీం (ఫోటో ఫీచర్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ అంతా ఒకే చోట చేరి క్రికెట్ ఆడుతూ సందడి చేసారు. ఇందుకు హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం వేదికైంది. పేదలు, వికలాంగుల సహాయార్థం 'క్రిసెంట్ క్రికెట్ కప్' పేరుతో నిర్వహించిన ఈ మ్యాచ్ లో సునీల్ శెట్టి నేతృత్వంలోని బాలీవుడ్ జట్టు....హీరో శ్రీకాంత్ నేతృత్వంలోని టాలీవుడ్ జట్లు తలపడ్డాయి.

  ఆద్యంతం ఆసక్తి కరంగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ నేతృత్వంలోని టాలీవుడ్ జట్టు విజయం సాధించి కప్ సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం చిల్డ్రన్ కమ్యూనిటీ వెల్పేర్ అసోసియేషన్‌కు రూ. 50 వేల విరాళం అందించారు. అదే విధంగా ప్రత్యేక ఒలంపిక్స్ లో పతకాలు సాధించిన సిరాజ్ బేగం, ఉస్మాను అభినందించి, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ తరుపున రూ. 25 వేల చొప్పున నగదు బహుమతి అందజేసారు.

  ఈ కార్యక్రమంలో సినీ తారలతో పాటు...క్రిసెంట్ కప్ నిర్వాహక కమిటీ చైర్మన్ షఫీ, డీజీపీ దినేష్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ, హైదరాబాద్ మాజీ పోలీస్ కమీషనర్, ఆర్టీసీ ఎండి ఎకె.ఖాన్ తదితరులు హాజరయి మ్యాచ్ ను తిలకించారు. ఓ వైపు మ్యాచ్ తో పాటు సినీతారల డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

  కప్ గెలుచుకున్న టాలీవుడ్ జట్టు

  సునీల్ శెట్టి నేతృత్వంలోని బాలీవుడ్ జట్టు

  టాలీవుడ్ జట్టు

  హీరోయిన్ల సందడి

  ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

  English summary
  Bollywood, Tollywood actors and actresses during Crescent Cricket Cup 2012 at LB stadium, Fateh Maidan Hyderabad. Nitin Kumar Reddy, Sonu Sood, Nani, Srikanth, Sakshi, Tarun Kumar, Allari Naresh, Tammareddy Bharadwaja, Rajiv Kanakala, Sunil Shetty, Madhavi Latha, Madhurima, Payal Ghosh, Sanjana Galrani, Madhu Shalini, Tashu Kaushik, Bhanu Sri Mehra, Piaa Bajpai, Naveen Chandra, Nikitha Narayan, Tanu Roy and others graced the occasion.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more