23న క్రికెట్-గర్ల్స్ అండ్ బీర్
సాజిటేరియస్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఉమేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రికెట్-గర్ల్స్ అండ్ బీర్" ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఎస్.సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదర్శ్, సూర్య తేజ్, నాగశౌర్య ఇందులో కథానాయకులు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ''ఇది సోషల్ డ్రామా. తెలుగులో ఇలాంటి సినిమా ఈ మధ్య రాలేదని కచ్చితంగా చెప్పగలను. ఆదర్శ్, సూర్యతేజ్, నాగశౌర్యలకు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. వాళ్ల టాలెంట్‌కి తగ్గ పాత్రలను ఇందులో చేశారు. ఓ కొత్త టీమ్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం"" అన్నారు.
ఈ సమావేశంలో చిత్ర కథానాయకులు సూర్యతేజ్, ఆదర్శ్, నాగసూర్య, కెమెరామేన్ శరత్ పాల్గొన్నారు. సారిక అప్హన్, వినోద్‌కుమార్, ఎమ్మెస్ నారాయణ, శివారెడ్డి, సూర్య, రాజా శ్రీధర్, రజిత, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: దాస్, శ్యామ్‌వై, మాటలు: రవి కిరణ్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విమల్.


Click it and Unblock the Notifications











