బెజవాడలో ఈవీఎంల ట్యాంపరింగ్.. క్రికెటర్ శ్రీశాంత్‌కు సంబంధమేమిటంటే?

క్రికెట్ మైదానంలో బ్యాట్స్‌మెన్లను బంతితో గడగడలాడించిన క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యారు. గతంలో ఒకట్రెండు సినిమాల్లో నటించినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన విలన్‌ పాత్రలో నటించిన మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమాలో కథ ఏంటి? శ్రీశాంత్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

క్రికెట్ రంగంలో అద్బుతమైన బౌలర్‌గా రాణించిన శ్రీశాంత్ కొన్ని వివాదాస్పద అంశాల కారణంగా ఆ ఫీల్డ్‌కు దూరమై.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హిందీ, మలయాళం, కన్నడ, తమిళ సినిమా రంగాల్లో కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అయ్యారు.

Cricketer Sreesanth to play Villian Role in Yamadheera Movie Here is the Story details

క్రికెట్ రంగానికి గుడ్ బై చెప్పిన శ్రీశాంత్.. తొలిసారి అక్సర్ 2 అనే హిందీ సినిమాలో నటించాడు. ఆ తర్వాత మలయాళ చిత్రం టీమ్ 5, ఆ తర్వాత మరో హిందీ చిత్రం క్యాబరేట్ సినిమాలో చోటా డాన్ అనే పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కెంపె గౌడ 2 చిత్రంలో ఆకట్టుకొన్నాడు. 2022లో ఆయన నటించిన సమంత నటించిన కాథువాకులా రెండు కాదల్ సినిమాలో అతిథి పాత్రలో నటించారు.

ఇక తాజాగా కన్నడ చిత్రం యమధీర అనే చిత్రంలో విలన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈవీఎం ట్యాంపరింగ్ నేపథ్యంగా సాగుతుందని ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ వెల్లడించింది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో తనదైన శైలిలో నటించారని నిర్మాత, దర్శకులు తెలిపారు.

కన్నడ హీరో కోమల్ కుమార్ నటించిన యమధీర సినిమాను శ్రీమందిరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వేదాల శ్రీనివాస్ నిర్మించారు. మార్చి 23వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, నిర్మాత డీఎస్ రావు, పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Cricketer Sreesanth to play Villian Role in Yamadheera Movie Here is the Story details

నటీనటులు: కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషిక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధుసూదన్ తదితరులు

దర్శకత్వం: శంకర్ ఆర్
నిర్మాత: వేదాల శ్రీనివాస్‌రావు
బ్యానర్: శ్రీమందిరం ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫి: రోష్ మోహన్ కార్తీక్
సాహిత్యం: వరదరాజ్ చిక్కబళ్ళపుర
ఎడిటింగ్:సీ రవిచంద్రన్
మ్యూజిక్: వరుణ్ ఉన్ని
రిలీజ్ డేట్: 2023-03-23

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X