నటి వీణా మాలిక్‌తో సహా భర్తపై క్రిమినల్ కేసు

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ నటి వీణా మాలిక్ మరో వివాదంలో ఇరుక్కుంది. పాకిస్థాన్‌కు చెందిన వీణా మాలిక్‌తో పాటు దుబాయ్‌కి చెందిన ఆమె భర్త అసద్ బషీర్ ఖాన్, వీరితో టీవీ కార్యక్రమాన్ని నిర్వహించిన పాకిస్థాన్ టీవీ చానల్ ఆర్గనైజర్లపై క్రిమినల్ కేసు నమోదైంది. దైవాన్ని అవమాన పరిచారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.

ఇటీవల వివాహం చేసుకున్న వీణా మాలిక్, అసద్ బషీర్ ఖాన్‌ పాకిస్థాన్‌లోని ఓ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చారు. నూతన దంపతులు కావడంతో ఈ కార్యక్రమంలో మతానికి సంబంధించిన పాట బ్యాగ్రౌండ్‌గా ప్లే చేసారు. ఈ సందర్భంగా వీణా మాలిక్ తన భర్తతో కలిసి డాన్స్ చేసింది.

Criminal case registered against Veena Malik and her husband

ఇలా చేయడం మహ్మద్ ప్రవక్త కుటుంబ సభ్యులను అవమానించడమే అంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో వీరిపై క్రిమినల్ కేసు నమోదైంది. తమపై కేసు నమోదు కావడం షాక్‌కు గురి చేసిందని వీణా మాలిక్ తెలిపింది. ఆ పాటను సాధారణంగా వివాహం సందర్భంగా ప్లే చేస్తారు. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. మాపై మాత్రమే కేసు వేయడం ఏమిటి?. అయినా టీవీ షోలో పాట ప్లే చేస్తే అందుకు మేము బాద్యులమా? అంటూ మండి పడింది. ఈ సంఘటన తర్వాత సదరు ఛానల్ కూడా క్షమాపణ చెప్పినపట్లు వీణా మాలిక్ తెలిపింది.

పెళ్లి తర్వాత నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఎవరి మనసు గాయపరచడం మాకు ఇష్టం ఉండదు. అనవసరంగా మమ్మల్ని వివాదాల్లోకి లాగుతున్నారు అంటూ వీణా మాలిక్ వాపోయింది. పెళ్లయిన దగ్గర నుండి వీణా మాలిక్ బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆమె నటించిన తెలుగు చిత్రం 'నగ్న సత్యం', హిందీ చిత్రాలు 'ముంబై 125 కి.మీ', 'యే దిల్దా మాములా', 'మిస్టర్ మనీ' చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X