క్రిమినల్స్: నిషా కొఠారికి చార్మి క్లాప్ (ఫోటోలు)
హైదరాబాద్ : బాలీవుడ్ బ్యూటీ నిషా కొఠారి ప్రధాన పాత్రలో మంత్ర ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై సి.హెచ్.వి.శర్మ నిర్మిస్తున్న చిత్రం 'క్రిమినల్స్'. ఈచిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. మంత్ర, మంగళ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. నిషా కొఠారిపై చిత్రీకరిచిన తొలి సన్నివేశానికి నటి చార్మి క్లాప్ నిచ్చారు. విజయ్ కుమార్ కొండ కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించారు.
క్రిమిన్సల్ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు స్లైడ్ షోలో...

క్రమినల్స్
దర్శకుడు తులసీరామ్ మాట్లాడుతూ...మంగళ చిత్రం తర్వాత శర్మతో కలిసి చేస్తున్న రెండో చిత్రమిది. సాఫ్ట్‌గా ఉండే అమ్మాయి అకస్మాత్తుగా కాళి రూపంలో విజృంభిస్తే ఎలా ఉంటుందనే పాత్రలో నిషా కొఠారి నటిస్తోంది. సైబర్ క్రైం నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిస్తున్నాము. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. డిసెంబరు చివరకి సినిమాని పూర్తి చేస్తాం. పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఆయన అన్నారు.

నిషా కొఠారి
నిషా కొఠారి మాట్లాడుతూ..పరిస్థితులను బట్టి సాఫ్ట్‌గా ఉండే ఒక అమ్మాయిలో ఎలాంటి మార్పులొచ్చాయి. ఆ మార్పులకు తను ఎలా రియాక్ట్ అయింది అనేది కథ. కాన్సెప్టు నాకు చాలా నచ్చింది. సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సాఫ్ట్ గా ఉంటూ డిఫరెంటు గెటపుల్లో కనిపిస్తాను. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

సంగీతం
మంత్ర, మంగళ చిత్రాల మాదిరి ఈ చిత్రం కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. సాంగ్స్ కంపోజింగ్ జరుగుతుంది. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆడియో ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నామని సంగీత దర్శకుడు ఆనంద్ తెలిపారు.

నటీనటులు, సాంకేతిక విభాగం
నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే...రాంజగన్, విజయసాయి, సతీష్, పూర్ణిమ, జిమ్ రాజు, శ్రీను తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా : టి.జస్వంత్, సంగీతం : మంత్ర ఆనంద్, ఎడిటర్ : వినయ్ రామ్, ఆర్ట్ : నాగేంద్ర బాబు, నిర్మాత : సి.హెచ్.వి. శర్మ, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : ఓషో తులసీరామ్.


Click it and Unblock the Notifications











