Dasara First Review: నాని, కీర్తీ సురేష్ అదుర్స్.. కానీ అలా ఉందంటూ బాంబు పేల్చిన క్రిటిక్!
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం దసరా. విరాటపర్వం లాంటి సినిమాను అందించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం భారీగా క్రేజ్‌ను సంపాదించుకొన్నది. అయితే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అధిగమిస్తుందా? అనే సందేహాలు ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పాపులర్ క్రిటిక్ ఈ సినిమాపై తన రివ్యూను ఎలా ఇచ్చారంటే..

పాన్ ఇండియా మూవీగా
దసరా చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందింది. దాదాపు ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను అన్నిభాషల్లో దేశవ్యాప్తంగా భారీగా ప్రమోట్ చేశారు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి.

పైసా వసూలు మూవీ అంటూ
దసరా సినిమా ఇలా ఉండగా.. దుబాయ్‌లో సెన్సార్ షో చూసిన క్రిటిక్ ఉమేర్ సంధూ తాజాగా ఈ సినిమాపై ట్విట్టర్‌లో రివ్యూ ఇచ్చారు. దసరా సినిమా పైసా వసూల్ సినిమా. పాన్ ఇండియా వైడ్ నాని కొత్త గేమ్ ఆడబోతున్నాడు. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌తో అందర్నీ మనసులను గెలుచుకొంటాడు అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

కీర్తీ సురేష్ బాంబులా అంటూ
ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో మరిన్ని విషయాలు తెలియచేస్తూ.. దసరా మూవీలో కీర్తీ సురేష్ ఫెర్ఫార్మెన్స్ బాంబులా పేలుతుంది. ఈ సినిమా అవార్డులు గెలుచుకోవడం గ్యారెంటీ. యాక్షన్ ఎపిసోడ్స్ టాప్ క్లాస్. ఇది పుష్ప 2.0 వెర్షన్ అంటూ ఉమేర్ సంధూ చివర్లలో బాంబు పేల్చాడు.

రివ్యూపై పలు అనుమానాలు
ఉమేర్ సంధూ అనే క్రిటిక్ ఇప్పటి వరకు రివ్యూ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను చూశాయి. దసరా సినిమాపై స్వయం ప్రకటిత క్రిటిక్ ఇచ్చిన రివ్యూ విషయంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చేస్తుంది. సినిమాను చూసి మీ అభిప్రాయలను చెప్పండి.


Click it and Unblock the Notifications











