twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు మీదే, డబ్బు కోసం మమ్మల్ని వేధించొద్దు: రజనీకాంత్

    నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకోవడానికి ఎన్నో జిమ్మికులు చేస్తారు, డిస్ట్రిబ్యూటర్లు వారి మాటలు నమ్మి అత్యధిక రేట్లకు సినిమాలను కొని... తర్వాత నష్టపోయామంటూ నటులను వేధించడం ఎంతమాత్రం సమంజసం కాదని.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకోవడానికి ఎన్నో జిమ్మికులు చేస్తారు, డిస్ట్రిబ్యూటర్లు వారి మాటలు నమ్మి అత్యధిక రేట్లకు సినిమాలను కొని... తర్వాత నష్టపోయామంటూ నటులను వేధించడం ఎంతమాత్రం సమంజసం కాదని రజనీకాంత్ అన్నారు.

    తమిళ నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న 'నెరుప్పుడా' ఆడియో వేడుక సోమవారం ఉదయం చెన్నైలోని శివాజీ గణేశన్ నివాసమైన అన్నై ఇల్లంలో జరిగింది... ఈ సందర్భంగా రజనీకాంత్ ఈ కామెంట్స్ చేసారు.

    అలా చేతులు కాల్చుకోవద్దు

    అలా చేతులు కాల్చుకోవద్దు

    సినిమా కొనే ముందు కాస్త ఆలోచించండి, అనుభవం ఉన్న వారి నుండి సలహాలు తీసుకోండి...... గత సినిమాల రిజల్టులను కొలమానం పెట్టుకుని దీనికి కూడా అంతే వస్తాయనే గుడ్డి నమ్మకంతో సినిమాలను కొనవద్దు అని రజనీకాంత్ సూచించారు. గతంలో కొచ్చాడయాన్, లింగా సమయంలో డిస్ట్రిబ్యూటర్లు రజనీకాంత్ ను ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.

    రివ్యూలు కాస్త లేటుగా రాయండి

    రివ్యూలు కాస్త లేటుగా రాయండి

    సినిమా విడుదలైన తర్వాత వెంటనే విమర్శిస్తూ రివ్యూలు రాయడం వల్ల నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. నిర్మాతకు డబ్బు రికవరీ అయ్యే సమయం ఇవ్వండి. విడుదలైన మూడు రోజుల తరువాత విమర్శలు ప్రచురిస్తే సినిమాకి మంచి జరుగుతుందన్న విశాల్ వ్యాఖ్యలను రజనీకాంత్ సపోర్ట్ చేసారు.

    విశాల్ నాయకత్వంపై

    విశాల్ నాయకత్వంపై

    విశాల్ ఇటీవల నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో.... విశాల్ సారథ్యంలో సినీ పరిశ్రమకు మంచి జరుగుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు రజనీకాంత్.

    శివాజీ గణేవన్ తో పోటీనా?

    శివాజీ గణేవన్ తో పోటీనా?

    ప్రభు తండ్రి శివాజీ గణేశన్తో కలిసి తాను పడయప్పా చిత్రంలో నటించానని ఆ చిత్రం ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. అన్నామలై చిత్రంలో తాను శివాజీగణేశన్ నటనను అనుకరిస్తూ నటించానన్నారు. చిత్రాన్ని ఆయనకు చూపించగా ఏరా నాకు పోటీయా? అని సరదాగా అన్నారని, తరువాత చాలా బాగా నటించావని అభినందించారని గుర్తు చేసుకున్నారు. నటనలో శివాజీగణేశన్కు పోటీ ఎవరూ లేరని అన్నారు.

    English summary
    Rajini and Vishal attended the audio launch of the film Neruppuda in Chennai, speaking at the occasion, hero Vishal stated that review writers should think about giving their opinions little late. "Give a film good time to breathe. Please review a film on the fourth day. Let it be in theatres for three days", said Vishal. Surprisingly, Superstar Rajni also felt the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X