For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  IPL 2021: CSK జట్టుకు సెలెక్ట్ అవ్వగానే జెర్సీ సినిమాలో నానిలా అరిచేసా: క్రికెటర్ హరిశంకర్

  |

  నేచురల్ స్టార్ నాని నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ ఇటీవల రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ కు మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మంది జీవితాల్లో జెర్సీ కూడా ఒక మూమెంట్ గా నిలుస్తోంది. ఇక ఇటీవల ఐపీఏల్ చెన్నై టీమ్ లో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు కూడా జెర్సీ మూమెంట్ తన లైఫ్ లో కూడా ఉందని అన్నాడు.

  సినిమాకు ప్రాణం పోశాడు

  సినిమాకు ప్రాణం పోశాడు

  నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా 2019లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం నాని కొన్ని నెలల వరకు క్రికెట్ కోచింగ్ తీసుకున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన మేకింగ్ తో సినిమాకు ప్రాణం పోశాడు. సినిమాలో క్రికెట్ అనే కాకుండా ఒక మనిషి లక్ష్యంపై ఉన్న భావాన్ని ఎమోషనల్ గా ప్రజెంట్ చేశాడు.

  బాలీవుడ్ లో కూడా

  బాలీవుడ్ లో కూడా

  ఇక సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే విధంగా రానించింది. ఇక ఈ కథపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధపడ్డాడు. హిందీలో దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  చాలా క్లారిటీగా చెప్పాడు

  చాలా క్లారిటీగా చెప్పాడు

  అయితే జెర్సీ సినిమా కథలో నాని చాలా ఏళ్ల తరువాత క్రికెట్ టీమ్ కు సెలెక్ట్ అవ్వగానే ఒక రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడ ట్రైన్ రాగానే గట్టిగా అరుస్తూ ఉంటాడు. జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకుల మధ్య తనను తాను నిరూపించుకునే మొదటి అవకాశం వస్తే మనిషి ఏ స్థాయిలో భావోద్వేగానికి లోనవుతాడో ఆ సీన్ తోనే దర్శకుడు చాలా క్లారిటీగా చెప్పాడు.

  జెర్సీ రియల్ సీన్

  జెర్సీ రియల్ సీన్

  అయితే అదే తరహాలో నిజమైన క్రికెటర్ కూడా ఎమోషనల్ అయ్యాడట. అతను మరెవరో కాదు. మన తెలుగు కుర్రాడు హరి శంకర్ రెడ్డి. కడప జిల్లాకు చెందిన 22ఏళ్ళ ఈ కుర్రాడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. జట్టులో స్థానం రాగానే ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడట. జెర్సీ సినిమా తనకు చాలా ఇష్టమని చెబుతూ చెన్నైకు సెలెక్ట్ అయ్యాను అని తెలియగానే రూమ్ లోకి వెళ్లి గట్టిగా అరిచినట్లు చెప్పాడు.

  ట్వీట్ చేసిన నాని

  జెర్సీ సినిమాలో గట్టిగానే అరిచే సీన్ తనను బాగా టచ్ చేసిందని ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ మూమెంట్ ఉంటుందని హరిశంకర్ వివరణ ఇచ్చాడు. ఇక ఈ యువ క్రికెటర్ ఫాస్ట్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రానిస్తున్నాడు. మరి చెన్నై జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి. ఇక అతనికి సంబంధించిన వీడియో చూసిన నాని కూడా చూసేసా అంటూ లవ్ సింబల్ తో ట్వీట్ చేశారు.

  English summary
  The emotional sports drama jersey starring Natural star Nani is known to have won two National Awards recently. Although the film was not a commercial hit at the box office, it did connect well with a section of the audience. The jersey also stands as a moment in many lives. The Telugu cricket player who recently got a place in the IPL Chennai team also said that the Jersey Moment is also in his life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X