టాలీవుడ్‌ను ఏలుతున్న సెక్సీ హీరోయిన్లు (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : తెలుగు సినిమాలకు హీరో ఎంత ప్రధానమో, హీరోయిన్ కూడా అంతే. ఒక రకంగా హీరోయిన్ లేకుండా ఉండే సినిమాలు రేర్. ప్రస్తుతం టాలీవుడ్లో హీరో తర్వాతి స్థానం హీరోయిన్‌దే. హీరో యాక్షన్ సన్నివేశాలతో దుమ్మురేపే ఎంటర్టెన్మెంట్ పంచితే...హీరోయిన్లు తమ అందాల ఆరబోతతో ప్రేక్షకులను సమ్మోహనులను చేయడం కామన్ అయిపోయింది. ఇక హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ అండ్ సెక్సీ సీన్ల సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు తెరపై ప్రతి సంవత్సరం వందకుపైగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను గమనిస్తే....టాప్ 10లో చోటు దక్కించుకుంది కొందరు మాత్రమే.

కొందరు హీరోయిన్లంటే నిర్మాతలకు సెంటిమెంటు కూడా. పలానా హీరోయిన్ అయితేనే తమకు అదృష్టం కలిసొస్తుందని, లాభాలు వస్తాయని భావిస్తూ ఉంటారు. బహుషా వారితో చేసిన సినిమాలు భారీ విజయం సాధించడమే అందుకు కారణం కావొచ్చు.

అరుంధతి సినిమాతో పాపులర్ హీరోయిన్‌గా మారిన అనుష్క...ఆ తర్వాత తెలుగు తెరపై టాప్ హీరోయిన్ గా మారింది. ముఖ్యంగా చారిత్ర నేపథ్యం ఉన్న సినిమాలకు అనుష్క తప్ప దర్శక నిర్మాతలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఈ సినిమాలు మాత్రమే కాదు...లవ్ అండ్ రొమాంటిక్ సినిమాల్లోనూ అనుష్క అదరగొడుతుండంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మారిపోయింది. ఇక వరుస హిట్లతో దూసుకు పోతున్న సమంతను అంతా లక్కీ హీరోయిన్ గా భావిస్తూ ఉంటారు.

అనుష్క శెట్టి

ప్రస్తుతం అనుష్క రెండు భారీ బడ్జెట్ చారిత్రక చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న రుద్రమదేవి కాగా, మరొకటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న బాహుబలి.

సమంత

తెలుగు సినీ పరిశ్రమలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒరకగ. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది', జూ ఎన్టీఆర్‌తో రామయ్యా వస్తావయ్యా సినిమాలతో పాటు ఈ సంవత్సరం 8 సినిమాల్లో నటిస్తోంది.

శృతి హాసన్

గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ మారిపోయిన శృతి హాసన్, ఇప్పడు గ్లామర్ పాత్రలతో తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఎవడు' చిత్రంలో నటిస్తోంది. మరో వైపు ఆమె నటించిన ‘బలుపు' చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సంవత్సరం ఆమె మొత్తం 6 చిత్రాల్లో నటిస్తోంది.

నిత్యా మీనన్

తనదైన నటన, అభినయంతో ఆకట్టుకునే నిత్యా మీనన్ ఈ సంవత్సరం ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో నటించింది. ఆమె ప్రస్తుతం ‘ఏమిటో ఈ మాయ' చిత్రంలో చేస్తోంది.

కాజల్ అగర్వాల్

ఈ సంవత్సరం ‘బాద్ షా' చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్ త్వరలో ‘ఎవడు' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది.

హన్సిక

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకావాలతో దూసుకుపోతున్న హీరోయిన్ హన్సిక. ఆమె నటించిన ‘సంథింగ్ సంథింగ్' చిత్ర ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలోనూ విడుదలైంది. ఈ సంవత్సరం ఆమె శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాతో పాటు, హలో బ్రదర్ రీమేక్ లో నటించబోతోంది.

అంజలి

తమిళంలో చాలా రోజుల క్రితమే పాపులారిటీ వచ్చినా...తెలుగులో మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అంజలి. ప్రస్తుతం ఆమె నటించిన ‘బలుపు' చిత్రం రేపు విడుదల కాబోతోంది. అదే విధంగా ఈ సంవత్సరం వెంకటేష్ సరసన ‘బోల్ బచ్చన్' తెలుగు రీమేక్ లో నటిస్తోంది.

శ్రీయ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీయ ఇప్పుడు చిన్న సినిమాలకే పరిమితం అయింది. ఆమె నటించిన ‘పవిత్ర' మూవీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాగార్జున సరసన ‘మనం' చిత్రంలో నటిస్తోంది.

నయనతార

నయనతార చివరగా తెలుగులో ‘కృష్ణం వందే జగద్గురుమ్', ‘గ్రీకు వీరుడు' చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అనామిక చిత్రం చేస్తోంది.

ఇలియానా

ఇలియానా చివరగా గత సంవత్సరం ‘జులాయి', ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలే చేయడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X