సన్నీ లియోన్ పాట హైలెట్: ‘కరెంటు తీగ’ ఆడియో డేట్
హైదరాబాద్: మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మనోజ్ కుమార్ కథానాయకుడిగా మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘కరెంట్ తీగ'. మంచు మనోజ్ కుమార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ నాయికలుగా నటిస్తున్న ఈచిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు.

జగపతిబాబు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అచ్చు సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను ఈ నెల 14న విడుదల చేసేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో పరిశ్రమ పెద్దల సమక్షంలో అత్యంత ఘనంగా...హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో విడుదల కానుంది. మంచు మనోజ్ పాడిన ‘దేవదాస్ బ్రేకప్' అనే పాటతో పాటు సన్నీ లియోన్ నర్తించిన ప్రత్యేక గీతం ‘కరెంట్ తీగ' చిత్రానికి హైలెట్‌గా నిలవనున్నాయి.


Click it and Unblock the Notifications











