తుఫాన్ ఎఫెక్ట్: ‘కరెంట్ తీగ’ రిలీజ్ వాయిదా!
హైదరాబాద్: మంచు మనోజ్, సన్నీ లియోన్, రాకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మాతగా తెరకెక్కిన ‘కరెంట్ తీగ' చిత్రం ఈ నెల 17న విడుదల కావాల్సి ఉండగా కోస్తాంధ్రలో హుద్ హుద్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా వేసారు.
తుఫానుతో అతలాకుతలం అయిన ఆయా ప్రాంతాల్లో ప్రజలు సినిమా చూసే పరిస్థితి లేక పోవడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సంప్రదించిన అనంతరం నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం ప్రాంతాల్లో తుఫాను కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

అచ్చు సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలు ఇప్పటికే ఆదరణ పొందుతున్నాయని, తమ ఇద్దరి కలయికలో ఈ చిత్రం హాట్రిక్‌గా నిలుస్తుందని కథానాయకుడు మనోజ్ తెలిపారు. ఉన్న పాటలన్నీ ఒక్కొక్కదానికి సంబంధం లేకుండా సంగీత దర్శకుడు అచ్చు తీర్చిదిద్దారని, కెమెరా పనితనం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పారని, జగపతిబాబు ఈ సినిమాకు ఓ మూలస్తంభంలా ఉంటారని ఆయన వివరించారు.
సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.


Click it and Unblock the Notifications











