‘కరెంట్ తీగ’ మళ్లీ రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్: మంచు మనోజ్ కథానాయకుడిగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు రూపొందించిన ‘కరెంట్ తీగ' ఈనెల 17న విడుదల అవ్వాల్సి ఉండగా హధూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేక పోవడంతో విడుదల వాయిదా వేసిన సంగతి తెలసిందే.
తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర హీరో మనోజ్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు తుఫాన్ బాధితుల కోసం విరాళాల సేకరణలో ఉన్నారు. ఈ సినిమా పాటలతో పాటు.. ట్రైలర్‌లో జగపతిబాబు నటన, సన్నీలియోన్ అందాలు ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి.

అచ్చు సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలు ఇప్పటికే ఆదరణ పొందుతున్నాయని, తమ ఇద్దరి కలయికలో ఈ చిత్రం హాట్రిక్‌గా నిలుస్తుందని కథానాయకుడు మనోజ్ తెలిపారు. ఉన్న పాటలన్నీ ఒక్కొక్కదానికి సంబంధం లేకుండా సంగీత దర్శకుడు అచ్చు తీర్చిదిద్దారని, కెమెరా పనితనం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పారని, జగపతిబాబు ఈ సినిమాకు ఓ మూలస్తంభంలా ఉంటారని ఆయన వివరించారు.
సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.


Click it and Unblock the Notifications











