రామ్ చరణ్ సినిమా ఎత్తేసి....మనోజ్-సన్నీ లియోన్ సినిమా!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఈ నెల 1న విడుదలైంది. మధ్యలో పెద్ద సినిమాల విడుదల ఏమీ లేక పోవడంతో దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమాకు థియేటర్ల డోకా లేకుండా పోయింది. అయితే ఈ నెల 17 పలు తెలుగు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.

నాగ చైతన్య ‘ఒక లైలా కోసం', మనోజ్-సన్నీ లియోన్ ‘కరెంటు తీగ' తదితర చిత్రాలు 17న విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని థియేటర్లలో రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఎత్తేసి ఆ స్థానంలో ‘కరెంటు తీగ' చిత్రం వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువగా బి,సి సెంటర్లలోని థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రాన్ని ఎత్తేయనున్నారు.

కరెంటు తీగ సినిమా విషయానికొస్తే...

'Current Teega' to replace GAV

మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నిలియోన్ ప్రధాన పాత్రల్లో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ‘A' సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సన్నీ లియోన్ ఐటం సాంగ్ సినిమా నుండి తీసేయాలని, అలా అయితేనే U/A సర్టిఫికెట్ ఇస్తామని తేల్చి చెప్పారట.

అయితే సినిమాకు ప్రధాన ఆకర్షణ శృంగార తార సన్నీ లియోన్ ఐటం సాంగు కావడంతో దర్శక నిర్మాతలు, హీరో ససే మిరా అన్నారు. దీంతో ఈచిత్రానికి ‘A' సర్టిఫికెట్ జారీ అయింది. ఈ విషయాలను హీరో మనోజ్ స్వయంగా వెల్లడించారు. సెన్సార్ బోర్డు అలా అనగానే షాక్ అయ్యాం. సన్నీ లియోన్ ఐటం సాంగ్ లేకుంటే సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. అందుకే ఆమె కోసం ‘A' సర్టిఫికెట్ తీసుకోవడానికి సిద్ధపడ్డామని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

సినిమా గురించి దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ- చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించి సూపర్‌హిట్‌గా నిలిచాయని, సన్నీలియోన్ అంటే కేవలం శృంగార నటి మాత్రమే కాదని, ఆమె ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించిందని, ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు సూపర్‌హిట్ అవుతుందని చెప్పడంతో పూర్తి నమ్మకంతో ఉన్నామని తెలిపారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని 17కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు.

సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X