టాప్ పొజిషన్లో ‘కరెంటు తీగ’ పాటలు!
హైదరాబాద్: ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లోని టీ కొట్లు మొదలుకుని అమెరికాలోని క్లబ్బుల వరకు చిన్న-పెద్ద అన్న వయోబేధం లేకుండా జనాల్ని ఉర్రూతలూగిస్తోంది ‘కరెంట్ తీగ' ఆడియో ఆల్బమ్. అచ్చు సంగీత సారథ్యంలో రూపొందిన ఈచిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తూ నె.1 చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

ముఖ్యంగా హీరో మనోజ్ స్వయంగా పాడిన ‘దేవదాస్ బ్రేకప్' సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువకులందరి నోళ్లలో నానుతోంది. సోషల్ మీడియాలో సైతం లక్షల లైకులు, షేర్లతో ‘కరెంటు తీగ' ఆడియో విజయపథంలో కొనసాగుతోంది. అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ‘కరెంట్ తీగ' చిత్రానికి ఆడియో మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈచిత్రంలో మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ కథానాయకులు!


Click it and Unblock the Notifications











