For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంతా చేస్తే అది...తమిళ రీమేకా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు మనోజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా బాలీవుడ్ హాట్ భామ సన్నీలియోన్ ప్రత్యేక పాత్రలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘కరెంట్ తీగ'. నిన్న విజయవాడలో ఆడియో జరుపుకున్న ఈ చిత్రం ఓ తమిళ చిత్రం రీమేక్ అని సమాచారం. అయితే ఎక్కడా కూడా ఆ విషయం ప్రస్తావన చేయటం లేదు.

    తమిళంలో 2013 లో వచ్చిన Varuthapadatha Valibar Sangam అనే చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపొందిందని తెలుస్తోంది. ఆ చిత్రంలో శివ కార్తికేయన్ చేసిన క్యారెక్టర్ ని మంచు మనోజ్, సత్య రాజ్ చేసిన పాత్రను జగపతి బాబు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా మంచు మనోజ్ సోషల్ మీడియోలో కరెక్టే అని అన్నారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి గతంలో డైరక్ట్ చేసిన దేనికైనా రెడీ కూడా మళయాళ చిత్రం రీమేక్..అయితే ఆ చిత్రం వివాదంలో ఇరుక్కున్న తర్వాత మాత్రమే ఆ విషయం బయిటకు వచ్చింది.

    Current Theega is a Tamil Film remake

    హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఇందులో జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ భామ సన్నీలియోన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. మంచు మనోజ్ పాడిన ‘దేవదాస్ బ్రేకప్'అనే పాటతోపాటు సన్నీలియోన్ నటించిన సాంగ్ కూడా చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చెప్తున్నారు.

    ఈ సినిమాని మంచు విష్ణు24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ‘ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. మంచు మనోజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సినిమా కరెంట్ తీగ అని' మంచు విష్ణు అన్నాడు.

    English summary
    Manoj’s Current Theega is a remake of a hit Tamil film Varuthapadatha Valibar Sangam (2013). Manoj Manchu and Jagapati Babu plays the roles enacted by Siva Karthikeyan and Satyaraj in Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X