సన్ని లియోన్ ...'లే లే లే నా రాజా...' (వీడియో)
హైదరాబాద్ : సన్నిలియోన్ తెలుగులో లే లే లే నా రాజా అంటూ పాట ఎత్తుకుంటే ఎలా ఉంటుంది. ఆ పాటకు ఆమె వేసే చిందులు ఏ రేంజిలో ఉంటాయి. వీటిని నిజం చేయాలనుకున్నాడు మంచు మనోజ్. తన వయస్సు కుర్రాళ్ల మనస్సుని పట్టుకుని వారిని థియోటర్స్ కు లాగటానికి సన్నిలియోన్ తో కలిసి స్టెప్స్ వేసాడు. అక్టోబర్ 17న వస్తున్న కరెంట్ తీగ చిత్రం కోసం ఆమె తో ఐటం సాంగ్ చేయించి స్క్రీన్ పంచుకున్నాడు. కోటి పాతిక లక్షలు ఖర్చు అయ్యిందని చెప్తున్న ఈ పాట కోసం వీరిద్దరూ ఎలా స్టెప్స్ వేసారో మీరూ చూడండి...
కరెంట్ తీగ విషయానికి వస్తే..సన్నీలియోన్ సెగ తెలుగు చిత్రసీమకు తగలబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ తెలుగు చిత్రంలో తళుక్కున మెరవబోతోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కరెంటు తీగ'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీలియోన్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వబోతోంది. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ ఈ వీడియో ద్వారా ఖరారు చేసారు.

ఈ చిత్రం కోసం సన్నీకి ఆకర్షణీయమైన పారితోషికం కూడా ఇచ్చినట్టు సమాచారం. ఆ ఆకర్షయనీయమైన పారితోషికం..పాతిక లక్షలు అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్‌వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్‌ను తీసుకోవడం జరిగింది అన్నారు.


Click it and Unblock the Notifications











