»   » వావ్...చరణ్ హీరోయిన్ ఎంత సెక్సీగా ఉందో!(ఫోటోలు)

వావ్...చరణ్ హీరోయిన్ ఎంత సెక్సీగా ఉందో!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ సరసన 'తుఫాన్' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్లో హీరోయిన్‌గా టాప్ రేంజిలో ఉన్న ప్రియాంక...కేవలం హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా అటు ఐటం గర్ల్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇటీవల బాలీవుడ్లో వచ్చిన 'జంజీర్'(తెలుగులో తుఫాన్)లో ఐటం సాంగ్ చేసిన ప్రియాంక, అంతకు ముందు 'షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రంలో బాద్మాష్ బబ్లిగా ఐటం సాంగ్ చేసి ఆడియన్స్‌కు కిర్రెక్కించింది. తాజాగా మరోసారి ప్రియాంక ఐటం గర్ల్‌గా కనిపించబోతోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామ్ లీలా' చిత్రంలో ప్రియాంక ఐటం గర్ల్‌గా ఖరారైంది.

'రామ్ లీలా' చిత్రంలో ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఆ ఫోటోను పరిశీలిస్తే....ఈ చిత్రంలోని ఐటం సాంగులో ప్రియాంక సెక్సీ సోయగాలను ప్రేక్షకులను అలరిస్తాయని స్పష్టమవుతోంది. మరిన్ని వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం....

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

‘రామ్ లీలా' చిత్రంలో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను ఇక్కడ చూడొచ్చు. ఆమె లుక్ ఎంతో సెక్సీ ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.

రణవీర్, దీపిక

రణవీర్, దీపిక

రామ్ లీలా చిత్రంలో దీపిక పదుకొనె, రణవీర్ సింగ్ హీరో హీరోయిన్లు. తొలిసారిగా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ పరిశీలిస్తే సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని స్పష్టం అవుతోంది.

సంజయ్ లీలా భన్సాలీ

సంజయ్ లీలా భన్సాలీ

సంజయ్ లీలా భన్సాలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘రామ్ లీలా' చిత్రం తెరకెక్కింది. ఇదొక ప్రేమకథా చిత్రం. సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ దర్శకుడి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలున్నాయి.

వివాదం

వివాదం

పవన్ శర్మ అనే న్యాయవాది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ‘రామ్ లీలా' సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. ‘నవంబర్ 15న విడుదలకు సిద్దంగా ఉన్న ఈచిత్రం యొక్క ఇటీవల విడుదలైన ప్రోమోలోని సన్నివేశాలు వివిధ వర్గాల మధ్య శతృత్వం పెంచే విధంగా ఉన్నాయని' పవన్ శర్మ ఆరోపించారు.

విడుదల

విడుదల


నవంబర్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Bollywood's 'Badmaash Babli' is back. Yes, the stunning Priyanka Chopra is all set to sizzle in the upcoming item number from Sanjay Leela Bhansali's movie Ram Leela. PC's first look from Ram Leela, shows the stunning, curvaceous actress in all white avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu