Custody రిలీజ్‌కు ముందే రీమేక్‌కు బాలీవుడ్‌లో భారీ ఆఫర్.. కస్టడీ 2 ప్లాన్ రెడీ.. నిర్మాత శ్రీనివాస చిట్టూరి

యువ సామ్రాట్ నాగచైతన్య అందాల తార కృతిశెట్టితో కలిసి నటించిన తాజా చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా.. పవన్ కుమార్ సమర్పించారు. ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ..

హీరోను బట్టి బడ్టెట్ లెక్కలు వేయం: హీరోను బట్టి బడ్జెట్, లెక్కలు వేయం. కథ ఎంత డిమాండ్ చేస్తే అంత పెట్టడానికి సిద్దంగా ఉంటాం. కథ డిమాండ్ చేయడంతో గోపిచంద్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో సిటీ మార్ సినిమా చేశాం. ఇక రామ్ పోతినేనితో ది వారియర్ సినిమా చేశాం. అది కూడా రామ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్.

Custody gets big offer from Bollywood to remake in Hindi says Srinivasa Chitturi

ఇప్పుడు కస్టడీ సినిమా కథ డిమాండ్ చేయడంతో నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో చేశాం. అయితే నాగచైతన్య మార్కెట్‌కు మించిన బడ్జెట్‌తో సినిమా తీశాం. ఎలాంటి లెక్కలు వేసుకొని చేసిన సినిమా కస్టడీ కాదు అని శ్రీనివాస చిట్టూరి తెలిపారు.

అరవింద్ స్వామి ఎలా ఒప్పుకొన్నాడంటే?: కస్టడీ కథను అరవింద్ స్వామి వినగానే వెంటనే రెమ్యునరేషన్ విషయం చర్చించకుండా సినిమా చేస్తానని ఒప్పేసుకొన్నారు. ప్రియమణి ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. ఇంకా చాలా క్యారెక్టర్‌లో మంచి డెప్త్ ఉంటుంది. కృతిశెట్టి వరుసగా రెండో సినిమా చేస్తున్నాం. మంచి ఆర్టిస్టు. లీడింగ్ హీరోయిన్లలో ఒకరు. మంచి ఫెర్ఫార్మర్. యూత్‌లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. యాటిట్యూడ్‌ మంచిగా ఉంటుంది అని..

Custody gets big offer from Bollywood to remake in Hindi says Srinivasa Chitturi

కస్టడీలో ఎప్పుడూ చూడని యాక్షన్ సీన్లు: కస్టడీ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ అద్బుతంగా ఉంటాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ మీరు చూడబోతున్నారు. దాదాపు 20 రోజులు అండర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. ఈ సినిమాలో నాలుగు ఎపిసోడ్స్ ఎక్ట్రార్డినరీగా ఉంటాయి. అందుకే నాగచైతన్య ఆ ఎపిసోడ్స్‌ను రివీల్ చేయవద్దని అన్నారని శ్రీనివాస చిట్టూరి తెలిపారు.

బాలీవుడ్‌లో రీమేక్ గురించి: బాలీవుడ్ నుంచి కస్టడీ సినిమా రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఉంది. ఇంకా చర్చల దశలోనే ఉంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తాం. రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకటి మా ప్రొడక్షన్‌లో చేయడం.. రెండోవది వాళ్ల ప్రొడక్షన్‌లో చేయడం లాంటి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఈ చర్చల విషయంపై క్లారిటీ లేదు. త్వరలోనే వెల్లడిస్తాం అని శ్రీనివాస చిట్టూరి తెలిపారు.

Custody gets big offer from Bollywood to remake in Hindi says Srinivasa Chitturi

తదుపరి ప్రాజెక్టుల గురించి: ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూవీ 90 శాతం పూర్తయింది. నాగార్జున అక్కినేనితో సినిమాను త్వరలోనే ప్రారంభిస్తాం. కస్టడీ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. సక్సెస్‌పై మాకు నమ్మకం ఉండటంతో కస్టడీ2 సినిమాకు ప్లాన్ చేశాం.నాగచైతన్య రెండు, మూడు కథలు విన్నాడు. వాటిలో ఒకటి ఫైనల్ అయిన తర్వాత ఆయనతో మరో సినిమాతోపాటు కస్డడీ 2 మూవీకి ప్లాన్ చేస్తున్నాం అని శ్రీనివాస చిట్టూరి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X