For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి

|

సోషల్ మీడియాలో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది. ఎంత మంది పొగిడే వారు ఉంటారో.. అంతే మంది తిట్టేవారుంటారు. సెలెబ్రిటీల విషయంలో ఈ సూత్రం పక్కాగా వర్తిస్తుంది. ఇక హీరోయిన్ల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్లు పొరపాటున ఆన్‌లైన్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారంటే ఇక అంతే సంగతి అంతే. అడ్డుఅదుపు లేని ప్రవర్తను, ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా సోయి ఉండని కొందరు మహానుభావులు అక్కడికి వచ్చేస్తారు. ఇష్టమొచ్చినట్టు కామెంట్లు పెట్టేస్తారు. బూతు పదాలతో కామెంట్లు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ఇక అలాంటి వారికి చెక్ పడనుంది.

చేదు అనుభవం..

చేదు అనుభవం..

ఇటీవల కొందరు హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికలైన ట్విటర్ ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా అభిమానులతో చాట్ చేస్తున్న సందర్భంలో కొందరు ఆకతాయిలు అడగకూడని ప్రశ్నలు అడుగుతూ వారిని ఇబ్బంది పెట్టారు. నివేదా థామస్ లాంటి వారికి ఇలాంటి సమస్య ఎదురైంది. అనంతరం వాటి గురించి చెప్పుకుంటూ.. ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దిశ ఘటన అనంతరం..

దిశ ఘటన అనంతరం..

తాజాగా హైదరాబాద్ లో దిశా హత్య మరియు హత్యాచార ఘటన అనంతరం.. బాధితురాలి క్యారెక్టర్ అలాగే అమ్మాయిల కట్టు, బొట్టు వంటి విషయాలపై అసభ్యకర కామెంట్స్ చేసిన కొందరిని హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అత్యాచారానికి సంబంధించి, అమ్మాయిలపైనా అసభ్యకరంగా పోస్టుల పెట్టిన వారి పనిని పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

సీన్లోకి ఎంటరైన అనసూయ..

దిశ ఘటనపై అనసూయ స్పందించడం ఆలస్యమైందని ఆమెను సైతం ఘోరమైన పదజాలంతో దూషించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారిపై మండిపడ్డ అనసూయ.. మా క్యారక్టర్, వేసుకొనే బట్టలు, అలంకరణను డిసైడ్ చేయడానికి మీరెవరని ఆక్రోశం వెళ్లగక్కారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని అనసూయ, చిన్మయి లాంటి వారు సైబర్ క్రైమ్ పోలీసులను కోరుతూనే ఉన్నారు.

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
 ముగింపు పలకనున్న పోలీసులు

ముగింపు పలకనున్న పోలీసులు

ఈ క్రమంలో ఇలాంటి నీచ సంస్కృతిని అదుపు చేయాలనే ఉద్దేశంతో సైబర్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. సామాజికంగా సున్నితమైన విషయాలపై, అలాగే సెలెబ్రిటీస్‌ని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెడితే తక్షణమే అరెస్ట్‌లు జరుగుతాయట. కాబట్టి నోటిని, బుద్ధిని అదుపులో ఉంచుకొని ప్రవర్తించాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

English summary
Cyber Police Check To Netizens Negative Trolling. Finally taken seriously!!! Thank you respective Sir!!! So all of you you-know-who-I-am-addressing .. BEWARE!!! You are not going to get away.. I am personally going to spend time on weekly basis to make sure you are behind the bars.. I am done being kind to you undeserving!
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more