చిరంజీవి వల్లే 8 వేల మంది ప్రాణాలు కాపాడాం.. క్రెడిట్ అంతా ఆయనకే.. మెగాస్టార్‌పై సీపీ సజ్జనార్ ప్రశంసల వర్షం
హైదరాబాద్ నగరంలో శాంతి, భద్రతలకు విశేషంగా కృషి చేస్తున్న సైబరాబాద్ పోలీసుల వార్షిక స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తోపాటు పాయల్ రాజ్‌పుత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పూర్తిదాయకమైన ప్రసంగాన్ని చేశారు. ఈ ముగింపు ఉత్సవాల్లో సజ్జనార్ మాట్లాడుతూ...

సైబరాబాద్ స్పోర్ట్స్ మీట్ ముగింపు సభలో
గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో సైబరాబాద్ పోలీసుల స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. మూడో స్పోర్స్ వార్షిక మీట్ జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నాలుగు రోజులపాటు జరిగాయి. ఈ స్పోర్ట్స్ మీట్‌లో 5 వందల మందితోపాటు దాదాపు ఏడు జట్లు పాల్గొన్నాయి. మంగళవారం జరిగిన ముగింపు ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడారు.

చిరంజీవి స్పూర్తి వల్ల
కరోనా లాక్‌డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్లాస్మా డొనేషన్ క్యాంప్ నిర్వహించాం. మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. చిరంజీవి ఇచ్చిన స్పూర్తి వల్ల దాదాపు 8 వేల మంది ప్లాస్మా డొనేషన్ చేశారు అని సజ్జనార్ చెప్పారు.

8 వేల మంది ప్రాణాలు కాపాడాం
ప్లాస్మా డొనేషన్ కారణంగా దాదాపు 8 వేల మంది ప్రాణాలను కాపాడాం. దానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిరంజీవికే దక్కుతుంది. చిరంజీవి ఇచ్చిన పిలుపు వల్ల అత్యధిక మంది ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవికి సైబరాబాద్ పోలీసులు, సైబారాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు.
Recommended Video

ప్లాస్మా డొనేషన్ క్యాంపులో మెగాస్టార్
లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం సందర్భంగా స్పూర్తి దాయకమైన సందేశాన్ని ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరిక మేరకు చిరంజీవి ఆ క్యాంపుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సజ్జనార్ ఆహ్లాదకరంగా మాట్లాడుతూ క్యాంపుకు హాజరైన, ప్లాస్మా దాతలకు నవ్వుల్లో ముంచెత్తడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











