హీరో కార్తికేయకు కౌంటర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు: సోషల్ మీడియాలో పోస్టు వైరల్
యంగ్ హీరో కార్తికేయ - సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాకే దక్కింది. ఈ సినిమా చూసిన వారంతా బస్తీ బాలరాజుగా కార్తికేయ చేసిన నటన గురించే మాట్లాడుతున్నారు. అలాగే, డీ గ్లామర్ రోల్‌లో కనిపించిన లావణ్యను ప్రశంసిస్తున్నారు. అయితే, కొన్ని బోరింగ్ సీన్స్ వల్ల సినిమాకు ప్రతికూల కామెంట్లు వస్తున్నాయి. అయితే, షోలు మాత్రం బాగానే నిండుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా 'చావు కబురు చల్లగా' గురించి తమ ట్విట్టర్ పేజిలో చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఈ చిత్ర పోస్టర్‌ను షేర్ చేస్తూ.. 'హెల్మెట్లు పెట్టుకొని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది కొద్ది సమయంలోనే ఊహించని రీతిలో వైరల్ అయిపోయింది. ఇది మాత్రమే కాదు.. ప్రజలను చైతన్య వంతం చేసేందుకు పోలీసులు ఇలానే ఎన్నో సినిమా పోస్టర్లను వాడుతూ గతంలోనూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, కార్తికేయ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో వచ్చిన 'చావు కబురు చల్లగా' సినిమాను కౌశిక్ పెగళ్లపాటి రూపొందించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించాడు. సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్రను పోషించగా, మురళి శర్మ మరో ముఖ్యమైన రోల్‌లో కనిపించారు. అలాగే బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది. జాక్స్ బిజాయ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











