రామ్ ‘ఒంగోలు గిత్త’ను దెబ్బ కొట్టిన తుఫాన్
హైదరాబాద్: రామ్ హీరోగా బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో 'ఒంగోలు గిత్త' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తుఫాన్ దెబ్బ కొట్టింది. ఈ చిత్రం కోసం వేసిన సెట్ పూర్తిగా తడిసిపోయింది. మరో రెండు రోజుల తర్వాత ఈ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ విషయమై రామ్ ట్వీట్ చేస్తూ..." భారీ వర్షం, ఈదురు గాలులతో 'ఒంగోలు గిత్త' షూటింగ్ మొత్తం ఆగిపోయింది. చూస్తూంటే రేపు కూడా షూటింగ్ జరిగేటట్లు లేదనిపిస్తోంది. అందరూ జాగ్రత్తగా ఉండండి ", అన్నారు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ... 'ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఒంగోలు గిత్త' టైటిల్ ని ఖరారు చేసాము. గుంటూరు మార్కెట్ యార్డులో పెద్ద షెడ్యూల్, హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ జరిగింది, తణుకులో నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుగుతోంది. నవంబర్ 15 వరకు షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. ఈ షెడ్యూల్ తో రెండు పాటలు మినహా టోటల్ షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు.
నవంబర్లో ఫస్ట్ లుక్ రిలీ్జ్ చేసి, డిసెంబర్లో సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.
రామ్, క్రితి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications











