శృతి హాసన్ నోట బూతులు, సెన్సార్ ఇబ్బందులు!
హైదరాబాద్ : హీరోయిన్ శృతి హాసన్ 'డి-డే' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ పాకిస్థాన్ వేశ్యగా కనిపించబోతోంది. ఈ చిత్రంలోని పాత్రకు తగిన విధంగా శృతి హాసన్ కొన్ని బూతు డైలాగులు చెప్పింది. అయితే అందులో కొన్ని ఇబ్బందికరమైన డైలాగులకు సినిమా సెన్సార్ బోర్డు కత్తెర వేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను బేస్ చేసుకుని డి-డే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రామ్ పాల్, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, శృతి హాసన్, హుమా ఖురేషి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జులై 19న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరో వైపు శృతి హాసన్ నటిస్తున్న మరో బాలీవుడ్ మూవీ 'రామయ్యా వస్తావయ్యా' కూడా జులై 19వ తేదీనే విడుదలవుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని హిందీలో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్‌లో నిర్మించిన ఈ చిత్రంలో గిరీష్‌కుమార్, శృతిహాసన్ జంటగా నటించారు. ఈ సినిమాపై శృతి హాసన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టయితే తన బాలీవుడ్ భవిష్యత్ బాగుంటుందనే నమ్మకంతో ఉంది. గతంలో 'లక్' అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఆమెకు ఆ సినిమా ప్లాపు కావడంతో బాలీవుడ్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తాజా రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో ఏ ఒక్క సినిమా హిట్టయినా బాలీవుడ్లో నిలదొక్కుకోవచ్చనే ఆలోచనతో ఉంది శృతి.


Click it and Unblock the Notifications












