‘డి ఫర్ దోపిడి’ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్: వరుణ్ సందేష్, సందీప్ కిషన్, మెలని, నవీన్, రాకేష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ రూపొందుతున్న చిత్రం 'డి ఫర్ దోపిడి'. దొబ్బడానికి? దొబ్బించుకోడానికా? అనేది సబ్ టైటిల్. హిందీలో '99', 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, దర్శకులు క్రిష్, సుకుమార్, దేవాకట్ట హాజరైన లోగో ఆవిష్కరణ జరిపారు. క్రైం, కామెడీ నేపథ్యంలో ఈచిత్రం సాగుతుంది. ప్రేక్షకులకు సస్పెన్స్ తో పాటు థ్రిల్, కామెడీని ఈచిత్రం నుంచి ఆశించ వచ్చు.
ఈ చిత్ర నిర్మాతలు హిందీలో దర్శకత్వం వహించిన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం బాగుందని, తెలుగులో వారు చేస్తున్న తొలి ప్రయత్నం విజయవంతం కావాలని దర్శకుడు సుకుమార్ ఆకాంక్షించారు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, 'డి ఫర్ దోపిడి' చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు మరో దర్శుడు క్రిష్.
ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, కెమెరా: లుకాస్, కళ: ఉపేంద్ర రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర, నిర్మాతలు: రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కె, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.


Click it and Unblock the Notifications











