వెన్నెల కిషోర్.... ‘D/o రామ్ గోపాల్ వర్మ’
హైదరాబాద్ : వెన్నెల కిషోర్ హీరోగా'D/o రామ్ గోపాల్ వర్మ' చిత్రం రూపొందబోతోందని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. తాజాగా ఈ చిత్రం ఈ నెలలోనే విడుదలకు సిద్దం అవుతోంది. నాటక రంగలో 9 నంది వార్డులు పొందిన ఖాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రంలో నవీన జాక్సన్, ఆరాస్ పిమేల్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ ఫిలింస్ బేనర్ పై బొక్కా నరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈచిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శుక్రవారం జరిగింది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకుడు ఎన్. శంకర్, ప్రసన్న కుమార్ పోస్టర్ ను ఆవిష్కరించారు. సినిమా గురించి దర్శకుడు ఖాజా వెల్లడిస్తూ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈచిత్రాన్ని రూపొందించామని తెలిపారు.
సినిమా కథ గురించి వెల్లడిస్తూ....ఓ సెల్రబిటీ తండ్రి, కూతుర్ల మధ్య సాగే కథే ఈ సినిమా. చాలా ఫన్నీగా ఉంటుంది. షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెల 20న ఆడియో విడుదల చేసి, 30న సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ఈ సినిమా టైటిల్ పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఖాజా స్పష్టం చేసారు.
ఈ చిత్రంలో ఇంకా...రోజా, జీవా, మేల్కోటి, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, ఫిష్ వెంకటేష్ తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక విభాగంలో....సంగీతం : ఆద్వేష్ రవి, లిరిక్స్ : సురేష్, బాలు, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రాఫర్ : పి.జి. విందా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మన్నె శ్రీనివాస్, ప్రొడ్యూసర్ : బొక్కా నరేంద్ర రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఖాజా.


Click it and Unblock the Notifications











