మూవీ మొగల్‌కి మరో సత్కారం
ప్రముఖ నిర్మాత, మూవీ మొగల్ డి. రామానాయుడిని మరో సత్కారం వరించింది. హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్ లోని బృందావనం (తెలుగు సమితి) మూడవ వార్షికోత్సవం సందర్భంగా రామానాయుడుని సత్కరించారు.
ఈ సందర్భంగా బిట్స్ క్యాంపస్ డైరెక్టర్ వి.ఎస్.రావు మాట్లాడుతూ, హైదరాబాద్ బిట్స్ క్యాంపస్ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా వివిధ రంగాలకి చెందిన ప్రముఖుల్ని సత్కరిస్తూ వస్తున్నామనీ ... తెలుగు సినీ వైభవానికి తన వంతు కృషి చేసిన రామానాయుడుని సత్కరించడం ఆనందంగా వుందని చెప్పారు.
వందకు పైగా చిత్రాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన.
రామానాయుడు వారసులుగా ఆయన తనయుడు సురేష్ బాబు సినీ నిర్మాణ రంగంలోకి అడిగు పెట్టగా, మరో తనయుడు వెంకటేష్ నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల ఆయన మనవడు రాణా కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇటు టాలీవుడ్ తో పాటు, అటు బాలలీవుడ్, హాలీవుడ్‌లో తన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











