»   » రామానాయుడు ఈ వయస్సులో కూడా ఆపకుండా...

రామానాయుడు ఈ వయస్సులో కూడా ఆపకుండా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిర్మాతగా నాకు, నా కుమారుడు సురేష్‌ కు మధ్య ప్రధాన వ్యత్యాసం ఉంది. నేను సినిమాలు తీసేటప్పుడు ఒకట్రెండు కోట్ల రూపాయలు నష్టపోయినా పట్టించుకోను. అదే సురేష్‌ బాబు మాత్రం రిస్క్‌ తీసుకోడు. అయిదొందల రూపాయలు ఖర్చైనా చాలా జాగ్రత్త పడతాడు అంటున్నారు ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు. దాదాసాహెబ్‌ ఫాల్కే అనార్డుని ఆయనకు ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తన తండ్రి గురించి సురేష్ బాబు మాట్లాడుతూ...ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి నాన్నగారు. ఒక నిర్మాతగా నేను కూడా నాన్నగారి నుంచి ఎంతో నేర్చుకొన్నా. డబ్బు పోయినా, నష్టాలు వచ్చినా మాటపై నిలబడతారు. ఆయన నిర్ణయాలకు మేమెప్పుడూ అడ్డు తగల్లేదు అన్నారు. ఇక ప్రస్తుతం రామానాయుడు..చంద్ర మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. సురేష్ బాబు మాత్రం కేవలం సమర్పుడుగా తన తమ్మడు వెంకటేష్, తన కుమారుడు రాణా చిత్రాలుకు వ్యవహిస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu