'సోలో'ని ఎవరికీ అమ్మలేదు: సురేష్ బాబు
పరశురామ్ చక్కగా రూపొందించిన 'సోలో'ని ఎవరికీ అమ్మకుండా ఎంతో నమ్మకంతో మా ద్వారా నిర్మాత సొంతంగా విడుదల చేశారు అని ప్రముఖ నిర్మాత,ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష్యుడు డి.సురేశ్‌బాబు తెలిపారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..సురేశ్ ఫిలిమ్స్ ద్వారా ఈ చిత్రాన్ని మేమే రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేశాం. ప్రేక్షకుల నుంచి బాగా ఆదరణ లభిస్తోంది. 'సోలో' చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్నారు. నారా రోహిత్, నిషా అగర్వాల్ జంటగా దర్శకుడు పరశురామ్ రూపొందించిన 'సోలో' చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
నారా రోహిత్ మాట్లాడుతూ -'' 'బాణం"తో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. రెండో సినిమాతోనే కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావడం చాలా ఆనందంగా ఉంది. జనాలకి ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాతో అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం"" అన్నారు. దర్శకుడు పరుశరామ్ మాట్లాడుతూ..."నైతిన విలువలు ప్రధానంగా ఈ సినిమా చేశాం. మంచి సినిమా చూశామని ప్రేక్షకులంతా అంటున్నారు. 'సోలో' అనే టైటిల్ చూసి, కొంతమంది దీన్ని యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. ఇది అన్ని వయసులవారూ చూసి ఆనందించదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'' అని చెప్పారు.
హీరోయిన్ నిషా అగర్వాల్ మాట్లాడుతూ చక్కని ఫ్యామిలీ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీగా రూపొందిన 'సోలో' విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎస్వీకే సినిమా పతాకంపై 'సోలో'ని నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ "మేం ఊహించిన దానికి మించి ఎక్కువగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా రోహిత్, నిషా బాగా చేశారు. యువత, ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా చిత్రాన్ని చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వమే ఈ సినిమా విజయానికి మూలం'' అన్నారు.


Click it and Unblock the Notifications











