బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు: డి.సురేష్ బాబు
కొంతమంది బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, ఇప్పటికిప్పుడు కార్మికులు పని చేయడానికి సిద్ధమైతే షూటింగ్స్ జరుగుతాయని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తెలిపారు.నూతన వేతన ఒప్పందం కోసం డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో వేతనాల విషయంలో వాస్తవాలను వెల్లడించే నిమిత్తం నిర్మాతల మండలి ఏర్పాటు చేసిన మీడియో మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు.అలాగే అవుట్‌డోర్‌లో షూటింగ్స్ జరుపుకుంటున్న నిర్మాతలను ఇబ్బంది పెట్టవద్దని అడిగితే మొదట అంగీకరించినా, రెండు రోజుల తర్వాత అక్కడ కూడా షూటింగ్స్ ఆపుచేశారని సురేష్‌బాబు అన్నారు.
సమస్య గురించి మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు ఇప్పుడున్నదానికి 32 శాతం పెంచడానికి మేం సిద్ధంగా ఉన్నాం. దానికి అంగీకరించి ఫెడరేషన్‌లో ఉన్న 17 యూనియన్ల వారు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అయితే కేవలం ఐదు యూనియన్ల వారు మాత్రం ఇంకా ఎక్కువ వేతనాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ వేతనం చెల్లించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్లు కావాలని కాలయాపన చేస్తున్నారు అన్నారు సురేష్ బాబు.


Click it and Unblock the Notifications











