‘దాన వీర శూర కర్ణ’ మరింత ఆలస్యం, ఎందుకు?

By Bojja Kumar

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘దాన వీర శూర కర్ణ'. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి పూర్తయింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘బాల రామాయణం' తర్వాత అంతా బాలనటీనటులతో వస్తున్న చిత్రమిది. స్వర్గీయ జానకీరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

'Daana Veera Soora Karna' in June

దర్శకుడు జెవిఆర్‌ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో బాగా తెరకెక్కించారు. కౌసల్య సంగీతం సారథ్యంలో ఇటీవల విడుదలైన పాటలకు చక్కని స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం వేసిన సెట్లు, గ్రాఫిక్స్‌ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మే 28న మహానటుడు నందమూరి తారక రామారావుగారి జయంతి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలనుకున్నాం. గ్రాఫిక్స్‌ పనులు కాస్త ఆలస్యం కావడంతో జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. ​

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X