పోలీసులకు స్పెషల్ ప్రీమియర్ షో
ఢిల్లీ: సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' చిత్రం భారీ విజయం సాధించడంతో దానికి సిక్వెల్ గా 'దబాంగ్-2' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.
ఢిల్లీ పోలీసుల కోసం 'దబాంగ్ 2' చిత్రం స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన కొందరు పోలీసులను ఇందుకోసం ఎంపిక చేసారు. హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి వారంతా డిసెంబర్ 18న వారు ఈ షో వీక్షించనున్నారు. అనంతరం సల్మాన్ ఖాన్ 2001లో డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు వీరుల కుటుంబాలను కలుసుకోనున్నాడు.
సినిమా విశేషాల్లోకి వెళితే...
సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా దబాంగ్‌లో పోషించిన పాత్రలే సీక్వెల్‌గా వచ్చిన దబాంగ్-2లో పాత్రలకి కొన సాగింపుగా నటించారు. అందులో 'బద్‌నామ్ హుయీ' ఐటమ్ సాంగ్‌లో నర్తించిన మలైకా అరోరా ఖాన్ సీక్వెల్లోనూ ఐటమ్‌సాంగ్‌లో నటించగా వినోద్ ఖన్నా కూడా ఒక పాత్రను ఈ చిత్రంలోనూ కొనసాగించారు. ప్రకాశ్‌రాజ్ విలన్‌గా నటించడం విశేషం.
దీపక్ డోబ్రియల్, సందీప్ ధార్, పండేజీ మిగతా పాత్రధారులు. 'ఫెవికాల్ సే' అని సాగే ప్రత్యేక గీతంలో కరీనాకపూర్ నృత్యం అలాగే మలైకా అరోరా ఖాన్, సోనాక్షి సిన్హా కలసి 'పాండేజీ సీటీ బజాయే...'లో చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా మారాయి. 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అభినవ్ సింగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందించిన దబాంగ్ 10-9-2010న విడుదలై 215 కోట్ల రూపాయలు ఆర్జించింది. దబాంగ్-2 అర్బాజ్‌ఖాన్ దర్శకత్వంలో 78 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది.


Click it and Unblock the Notifications











