మహేష్-మలైకా మధ్య అప్పుడేం జర్గింది?

తాను ఛయ్యా ...ఛయ్యా అంటూ దిల్ సే లో షారూఖ్ తో డాన్స్ చేసానని అయితే చేస్తున్నంతసేపు షారూఖ్ చాలా ఇంటిమసి గా బిహేవ్ చేసేవాడంది. అయితే అదే మహేష్ దగ్గరకి వచ్చేసరికి అసలు తనతోనే మాట్లాడలేదని దాదాపుగా షూటింగ్ పూర్తయ్యేలోగా కేవలం ఓ ఐదు మాటలు మాత్రమే మాట్లాడి ఉంటాడంది. తననొక డాన్సర్ గానే పరిగణించాడని అంతకు మించి పట్టించుకోలేదని వాపోయింది. అదంతా తనకి చాలా విచిత్రంగా ఉండేదని అయితే సౌత్ ఇండియా కల్చర్ ఇదేనేమో అని సరిపెట్టుకున్నానంది.
అయితే మాత్రం మహేష్ చాలా జెంటిల్ మెన్ అని పొగిడింది. ఇక ఈ డాన్స్ ఒప్పుకోవటానికి కారణం మహేష్ భార్య నమ్రతతో ఉన్న స్నేహమని వివరించింది. ఆమె ఆ పాట ట్యూన్ తనకి వినిపించి తనని ఒప్పించిందని దాంతో ఎంత బిజీగా ఉన్నా ఇక్కడకు వచ్చి డాన్స్ చేసానని అంటోంది. ప్రస్తుతం ఈ 34 ఏళ్ళ ముద్దుగుమ్మ అర్జున్ రాంపాల్ హీరోగా చేస్తున్న ఇ.ఎమ్.ఐ అనే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











