ఆయన మిలటరీలో ఉండాల్సిన వ్యక్తి : మంచు లక్ష్మి
మిలిటరీలో ఉండాల్సిన వ్యక్తి సినిమాల్లో ఉన్నారు...అంటూ తన తండ్రి మోహన్ బాబు గురించి వ్యాఖ్యానించింది మంచు లక్ష్మి ప్రసన్న. ఆయన క్రమశిక్షణకు ఎంత విలువిస్తారో అందరికీ తెలిసిన విషయమే. మా చదువు, ఆటలు, ఎక్స్‌ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్ విషయాల్లో చారా శ్రద్ధ తీసుకునే వారు.. అంటూ చెప్పుకొచ్చింది.
ఏ విషయంలోనైనా తండ్రి మోహన్‌బాబు తనకు మార్గదర్శి,ఆదర్శప్రాయుడు, చిన్నప్పుడు నాన్నంటే తెగ భయపడేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆయన మంచి స్నేహితుడు అని మంచు లక్ష్మీప్రసన్న చెబుతున్నారు. ఇప్పటికీ ఆయన మా నుంచి పద్ధతి, క్రమ శిక్షణ ఆశిస్తుంటారు...అలా అని మమ్మల్ని బలవంత పెట్టే రకం కాదు అని చెప్పింది.
మా కుటుంబం ఇప్పడు ఈ స్థాయిలో ఉందంటే కారణం ఆయనే...అందకే కుటుంబ సభ్యుల మంతా ఆయన్ను మర్గదర్శిగా భావిస్తాం అని...తండ్రి గురించి తన మనసులోని మాటను బయట పెట్టింది లక్ష్మి. మంచు లక్ష్మి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ 'డిపార్టుమెంట్"లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











