గర్వంగా ఉంది: భార్య ఉపాసనకు ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డు రావడంపై రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన 'దాదా సాహెబ్ ఫాల్కే-ఫిలాన్‌త్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్నారు. శనివారం ముంబైలో జరిగిన ఫాల్కే అవార్డుల కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారం దక్కింది. భార్యకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై చరణ్ ఫేస్ బుక్ పేజీ ద్వారా రియాక్ట్ అవుతూ అభిమానులతో ఈ విషయం పంచుకున్నారు.
'డియర్ ఉప్సి... నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 'దాదా సాహెబ్ ఫాల్కే-ఫిలాన్‌త్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్' అందుకున్నందుకుగాను నిన్ను అభినందిస్తున్నాను’ అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.
భార్య ఫోటో షేర్ చేసిన చరణ్
ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీలో ఆమెకు దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డును అందించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్.. ఉపాసన అవార్డు అందుకున్న ఫోటో షేర్ చేశారు.

ఈ అవార్డ్ వారికే అంకింతం అని చెప్పిన ఉపాసన
అవార్డు అందుకోవడంపై ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ... ‘ ‘దాదా సాహెబ్ ఫాల్కే-ఫిలాన్‌త్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్' అందుకోవడం సంతోషంగా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా నాకు సందేశాలు పంపుతూ నన్ను మోటివేట్ చేస్తూ ప్రతి రోజు మంచి పనులు చేసేలా నన్ను ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను.' అన్నారు.

కుటుంబం మద్దతు ఉండటం వల్లే
కుటుంబ సభ్యుల మద్దతు, సహకారం ఉండటం వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. ఈ రోజు నాకు అవార్డు రావడానికి ప్రధాన కారణం వారి ప్రోత్సాహమే. ఈ అనుభూతి ఎంతో గొప్పగా ఉంది అంటూ ఉపాసన పేర్కొన్నారు.

మెగా అభిమానుల నుంచి స్పందన
ఉపాసనకు అవార్డు రావడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైకులు, కామెంట్లతో ముంచెత్తారు. రామ్ చరణ్ ఈ పోస్ట్ షేర్ చేయగానే వేల సంఖ్యలో రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











