twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అపుడు నాన్న హ్యాపీగా లేరు, మా అత్తగారు అలా... శ్రీజ బెటర్: మెగా డాటర్ సుష్మిత

    By Bojja Kumar
    |

    Recommended Video

    నాన్న అపుడు హ్యాపీగా లేరు మా అత్తగారు అలా... శ్రీజ బెటర్..!

    మెగా స్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కూడా సినిమా రంగలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే యాక్టింగ్ సైడ్ కాకుండా తెర వెనక కాస్టూమ్ డిజైనర్ గా ఆమె తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మిత తన సోదరుడు రామ్ చరణ్ మూవీ 'రంగస్థలం', తండ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి పని చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుష్మిత ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    అపుడు నాన్న సంతోషంగా ఉండేవారు కాదు

    అపుడు నాన్న సంతోషంగా ఉండేవారు కాదు

    సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత నాన్న ఒకానొక సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. చాలా మంది మెగాస్టార్ వయసు 60 ఏళ్లు దాటింది కదా, ఇంట్లో కూర్చుని హ్యాపీగా రెస్టు తీసుకుంటున్నారు అని భావించేవారు. కానీ అలా ఇంట్లో విగ్రహంలా కూర్చోవడం నాన్నకు ఇష్టం ఉండేది కాదు, షూటింగులకు వెళ్లకుండా ఉండటం నాన్నకు సంతోషాన్ని ఇచ్చేది కాదు... అని సుష్మిత తెలిపారు.

     మా అత్తగారు అలా అనేవారు

    మా అత్తగారు అలా అనేవారు

    మా అత్తగారికి నేను నటిని కావాలని ఉండేది. ఇప్పటికీ ఆమె నటిగా ట్రై చేయ్, నిన్ను వెండితెర మీద చూడాలని ఉంది అని చెబుతుంటారు. ఏది ఏమైనా ఇపుడు నేను నాన్న, చరణ్ తో కలిసి సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుండటంపై వారు సంతోషంగా ఉన్నారు... అని సుష్మిత తెలిపారు.

     ఆ విషయంలో మాకంటే శ్రీజ బెటర్

    ఆ విషయంలో మాకంటే శ్రీజ బెటర్

    స్కూలు రోజుల్లో నేను, చరణ్ చదువులో బిలో యావరేజ్. అయితే శ్రీజ చదువులో టాపర్ గా ఉండేది. నాన్న చూస్తే కోప్పడతారు అనే భయంతో చెర్రీ, నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ దాచేవాళ్లం. చిన్న తనంలో నేను, చరణ్ బాగా కొట్టుకునేవాళ్లం. అయితే చరణ్ చదువుల నిమిత్తం మద్రాసు హాస్టల్ కొన్ని రోజులు మాకు దూరంగా ఉన్నాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ బాగా పెరిగింది అని సుష్మిత తెలిపారు.

     దూసుకెలుతున్న సుష్మిత

    దూసుకెలుతున్న సుష్మిత

    సుష్మితకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇందులో ఆమె కోర్సు కూడా చేశారు. ఫ్యామిలీ సపోర్టు కూడా ఉండటంతో సుష్మిత దూసుకెలుతున్నారు. చిరంజీవి, చరణ్ సినిమాలు ఇప్పటి వరకు ఆమె అందించిన డిజైన్స్ ది బెస్ట్ గా ఉన్నాయనే ప్రశంసలు పొందారు.

     ఇంద్ర సినిమా సమయంలోనే

    ఇంద్ర సినిమా సమయంలోనే

    గతంలో సుష్మిత తన తండ్రి ‘ఇంద్ర' సినిమా చేసినప్పుడే ఆమె ఈ రంగంలోకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టింది. అప్పటినుండి అందరివాడు, శంకర్ దాదా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత తర్వాత పిల్లలు పుట్టడంతో గ్యాప్ తీసుకుని మళ్ళీ ఖైదీ నెంబర్ 150కి, తన తమ్ముడు చరణ్ చేసిన ధృవ సినిమాలకు పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారారు.

     సుష్మిత ఫ్యామిలీ

    సుష్మిత ఫ్యామిలీ

    సుష్మిత వివాహం 2006 మార్చి2న విష్ణు ప్రసాద్ తో జరిగింది. విష్ణు ప్రసాద్ వ్యాపారంలో రాణిస్తుండగా... సుష్మిత తనకు ఇష్టమైన సినిమా కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తన సత్తా చాటుతున్నారు.

    English summary
    Chiranjeevi Daughter Sushmita said, "Daddy feels sad to sit at home without work and he won't be happy without going to shooting too. That's why we will also feel happy if he is on the sets of a film rather being at home".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X