మొదటిసారిగా నోరు విప్పిన దగ్గుబాటి అభిరామ్.. రానా పెళ్లిపై కామెంట్
దగ్గుబాటి అభిరామ్.. కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ స్టార్ హీరో కంటే ఎక్కువ ఇమేజ్ దక్కించుకున్నాడు. అయితే అది మాత్రం శ్రీ రెడ్డి మూలానే. అప్పట్లో శ్రీరెడ్డి,అభిరామ్ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిరామ్‌తో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే వాటిలో ఏ ఒక్క దానిపైనా దగ్గుబాటి వారు స్పందించలేదు.

మీడియా ముందుకు రాలేదు..
శ్రీ రెడ్డి అంతగా ఆరోపణలు చేస్తున్నా.. మోసం చేశాడని చెబుతున్నా.. ప్రైవేట్ ఫోటోలను షేర్ చేసినా కూడా దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రం స్పందించలేదు. సురేష్ బాబు కూడా ఎన్నడూ ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎక్కువగా మీడియా కంట పడని దగ్గుబాటి అభిరామ్ తొలిసారిగా కొన్ని విషయాలపై స్పందించాడు.

జయంతి కార్యక్రమంలో..
నేడు దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి. ఈ మేరకు ఫిలిం చాంబర్‌లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన దగ్గుబాటి అభిరామ్.. మీడియాతో ముచ్చటించాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

త్వరలోనే ఎంట్రీ..
వెండితెరపై హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇస్తానని తెలిపాడు. ఈ మేరకు కథలు కూడా వింటున్నామని, సురేష్ బాబు గారు ఫైనలైజ్ చేస్తారని పేర్కొన్నాడు. లవ్ స్టోరీ, సమాజానికి సందేశాన్ని ఇచ్చే కథలను చేయాలనుకుంటున్నానని అన్నాడు. అయితే ఈ ఏడాదో వచ్చే ఏడాదో స్పష్టంగా తెలీదు కానీ హీరోగా రాబోతోన్నట్టు ప్రకటించాడు.

రానా పెళ్లిపై..
అలాగా దగ్గుబాటి అభిరామ్ మాట్లాడుతూ రానా పెళ్లిపై కామెంట్ చేశాడు. ఆగస్ట్ 8న పెళ్లి అని అనుకుంటున్నామ్ అయితే కరోనా ఎలా ఉంటుందో చెప్పలేం.. దాన్ని బట్టి ఎలా చేయాలని ఎంతమందిని ఆహ్వానించాలో ఇంకా ఏం డిసైడ్ కాలేదని తెలిపాడు.


Click it and Unblock the Notifications











