రానా సోదరుడు హీరోగా వస్తున్నాడు, హీరోయిన్ ఈవిడే... పూర్తి డేటేల్స్ ఇవే!
Recommended Video

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటికే వెంకటేష్, రానా హీరోలుగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కొనసాగుతుండగా.... రానా సోదరుడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
తాజాగా ఈ చిత్రాన్నికి దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ కూడా ఖరారైంది. త్వరలోనే 'అభిరామ్' హీరోగా సినిమా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భాను శంకర్ దర్శకత్వంలో అభిరామ్ ఎంట్రీ
తన తనయుడు అభిరామ్‌ను ప్రేమ కథా చిత్రం ద్వారా తెరంగ్రేటం చేయించేందుకు నిర్మాత సురేష్ బాబు కొంతకాలంగా కథలు వింటున్నాడు. దర్శకుడు భానుశంకర్ చెప్పిన కథ నచ్చడంతో అతడితోనే అభిరామ్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిరామ్ సోదరుడు రానాకు కూడా కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది.

సొంత బేనర్లోనే సినిమా
తమ సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

హీరోయిన్ మాళవిక వర్మ
ఈ చిత్రంలో అభిరామ్ సరసన ముంబై బ్యూటీ మాళవిక శర్మను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లుక్ పరంగా, ఫిజిక్ పరంగా మాళవిక శర్మ అభిరామ్‌కు తగిన జోడీగా ఉంటుందని భావిస్తున్నారు.

అభిరామ్ తెరంగ్రేటానికి టాలీవుడ్ స్టార్స్ అందరూ...
అభిరామ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసే కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ స్టార్లందరినీ ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











