»   » రానా, వెంకీ అక్కడికి వెళ్లడంపై అనేక సందేహాలు?

రానా, వెంకీ అక్కడికి వెళ్లడంపై అనేక సందేహాలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రానా దగ్గుబాటి, వెంకటేష్ ఉన్నట్టుండి కొడైకనాల్ లో వాలిపోయారు. వీరు ఫ్యామిలీ వెకేషన్లో భాగంగా ఇక్కడికి వచ్చారా? లేక ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా స్క్రిప్టు చర్చించడంలో భాగంగా ఇక్కడికి వచ్చారా? అనేది ఆసక్తిగా మారింది. అయితే రానా తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటోల్లో ఈ ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు.

వెంకటేష్, రానా కాంబినేషన్లో సినిమా చేయాలని రామానాయుడు ఎప్పుడో ఆలోచన చేసారు కానీ దాన్ని ఆచరణలోకి తేక ముందే ఆయన కాలం చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తనయుడు, నిర్మాత సురేష్ బాబు వెంకీ, రానా కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Daggubati Heroes @ Kodaikanal

ఈ విషయమై రానా గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.....బాబాయ్ వెంకటేష్ తో కలిసి త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. సరైన స్క్రిప్టు దొరికితో రానాతో కలిసి చేయడానికి సిద్దమే అని వెంకటేష్ కూడా గతంలో ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్క్రిప్టు ఓకే అయినట్లు తెలుస్తోంది.

బాబాయ్-అబ్బాయ్ బాడీ లాంగ్వేజ్.... వాళ్ల వాళ్ల స్టార్ ఇమేజ్‍‌కు తగిన విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. స్క్రిప్టు పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. వీరి సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లోనే చిత్రం నిర్మాణమయ్యే అవకాశం ఉంది.

English summary
Rana Daggubati pleasantly surprised everyone on Thursday with photos clicked in Kodaikanal. The interesting factor is the presence of Venkatesh in those pictures.
Please Wait while comments are loading...