ఫిల్మ్ లెజెండ్: ‘రామానాయుడు’ సినీ ప్రస్థానం

By Bojja Kumar

హైదరాబాద్: డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. చివరి స్వాస వరకు ఆయన నిర్మాతగా సేవలందించారు.

తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. సెప్టెంబర్ 9, 2010న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది.

Daggubati Ramanaidu film history

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామానాయుడు తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణ ను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు.

ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరిక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరిక్షలు కూడా తప్పాడు. రామానాయుడు కు మామ కూతురు రాజేశ్వరితో పెళ్లి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు.వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు.

కారంచేడులో 'నమ్మిన బంటు' షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించాడు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తునప్పుడు 'మీరు సినిమాల్లోకి ఎందుకు కాకూడదు?' అని అక్కినేని అడికితే, వూరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు, ఓ రోజు హఠాతుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు ముసివేషి, వూరు విడచి చెన్నపట్నం చేరుకున్నాడు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నాడు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవాడు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X